తెలంగాణ

telangana

ETV Bharat / business

Small Savings Scheme KYC Deadline : స్మాల్ సేవింగ్స్ స్కీమ్​లో పొదుపు చేస్తున్నారా?.. ఆధార్​, పాన్​ సబ్మిట్​ చేయడానికి ఆఖరి తేదీ ఇదే!

Small Savings Scheme KYC Deadline : మీరు చిన్న పొదుపు పథకాల్లో మదుపు చేస్తున్నారా? అయితే సెప్టెంబర్​ 30లోపు ఆధార్​, పాన్​ కార్డులు సమర్పించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి. లేకుంటే మీ స్మాల్ సేవింగ్స్​ అకౌంట్స్​ సస్పెండ్​ అయిపోతాయి. పూర్తి వివరాలు మీ కోసం..

small savings scheme kyc deadline
Deadline To Link Aadhaar PAN With Small Saving Schemes

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 3:23 PM IST

Small Savings Scheme KYC Deadline : స్మాల్​ సేవింగ్స్ అకౌంట్ (చిన్న పొదుపు ఖాతా)​ ఖాతాదారులకు అలెర్ట్​. 2023 సెప్టెంబర్​ 30లోపు మీరు కచ్చితంగా ఆధార్​, పాన్​ కార్డులను సమర్పించి కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు గడువులోగా కేవైసీ అప్​డేట్​ చేసుకోకపోతే.. మీ ఖాతాలు సస్పెండ్​ అయిపోతాయి. మీరు కనుక ఇప్పటికే కేవైసీ చేసుకుని ఉంటే.. ఆధార్​, పాన్​ కార్డ్​లను మరలా సమర్పించాల్సిన అవసరం లేదు.

తప్పనిసరి!
Deadline To Link Aadhaar PAN With Small Saving Schemes :కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2023 మార్చి 31న చిన్న పొదుపు ఖాతాదారులు అందరూ కచ్చితంగా ఆధార్​, పాన్​ డాక్యుమెంట్స్​​ సమర్పించి కేవైసీ పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్​ విడుదల చేసింది.

ఎవరు సమర్పించాలి!
చిన్న పొదుపు ఖాతాలు తెరచినప్పుడు ఎవరైతే ఆధార్​, పాన్​కార్డ్​లను సమర్పించలేదో.. వాళ్లు ఇప్పుడు కచ్చితంగా వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గడువులోగా.. తమ పొదుపు ఖాతాలు ఉన్న బ్యాంక్​ లేదా పోస్ట్ ఆఫీస్​ లేదా సంస్థల్లో వాటిని సబ్​మిట్ చేయాల్సి ఉంటుంది.

వాళ్లకు అవసరం లేదు!
కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్​ 1 నుంచి స్మాల్​ సేవింగ్స్ స్కీమ్​లో చేరిన ప్రతి ఒక్కరూ ఆధార్​, పాన్​ కార్డ్ సమర్పించడం తప్పనిసరి చేసింది. ఇవి లేకుండా వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. దీనిని మరోవిధంగా చెప్పాలంటే.. 2023 ఏప్రిల్ 1 తరువాత చిన్న పొదుపు ఖాతాలు తెరచినవారు.. ఇప్పుడు మరలా ఆధార్​, పాన్​ సమర్పించాల్సిన అవసరం లేదు.

ఆధార్​, పాన్ ఇవ్వకపోతే ఏమౌతుంది?
ఒక వేళ ఎవరైనా గడువులోగా ఆధార్​, పాన్​ సమర్పించకుండా ఉంటే.. వారి ఖాతాలు సెప్టెంబర్​ 31 తరువాత సస్పెండ్ అవుతాయి. ఫలితంగా సదరు ఖాతాదారులు తమ అకౌంట్​ ద్వారా నగదు లావాదేవీలు చేయడానికి వీలుపడదు. ఎప్పుడైతే.. వాళ్లు తమ ఆధార్​, పాన్​లను సమర్పించి, కేవైసీ పూర్తి చేస్తారో.. మరలా అప్పుడే ఆ స్మాల్​ సేవింగ్స్ స్కీమ్స్​ యాక్టివేట్ అవుతుంది.

ముఖ్యమైన స్మాల్​ సేవింగ్స్ స్కీమ్స్​!
Small Savings Schemes In India : వివిధ రకాలైన పోస్టు ఆఫీస్ పథకాలు, ఫిక్స్​డ్​ డిపాజిట్స్​ (FD), రికరింగ్​ డిపాజిట్స్​ (RD), పోస్ట్ ఆఫీస్​ మంత్లీ ఇన్​కం స్కీమ్​, సుకన్య సమృద్ధి యోజన, టైమ్ డిపాజిట్స్​ (TD), మహిళా సమ్మాన్ సేవింగ్స్​ సర్టిఫికేట్​, పబ్లిక్ ప్రావిడెంట్​ ఫండ్​ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్​, కిసాన్​ వికాస్​ పత్ర (KVP). మీరు కూడా ఆయా పథకాల్లో పొదుపు చేస్తూ ఉంటే.. కచ్చితంగా సెప్టెంబర్​ 30లోపు ఆధార్​, పాన్ కార్డులు సమర్పించి కేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details