ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు, ఇతర సాధారణ కంపెనీలు గణనీయంగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక బారాన్ని తగ్గించుకునేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. భారీగా ఉద్యోగులను తొలగిస్తూ.. ఉన్న కొంది మందికి జీతాలు తగ్గించేస్తున్నాయి. భారతీయులు సైతం స్వదేశాల్లో, విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే, బ్రిటన్కు చెందిన ఎలోన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ.. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రపంచమంతా ఆర్థిక మాద్యంలోకి అడుగుపెడుతున్న వేళ.. భారత్లో ఆ ప్రభావం తక్కువగా ఉంటుందని ఆ సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. భారత్లో ఈ సంవత్సరంలో(2023) ఉద్యోగులకు 10.3 శాతం జీతాలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఎలోన్ పబ్లిక్ లిమిటిడ్ కంపెనీ జరిపిన 28వ భారత వార్షిక వేతన పెంపు సర్వే.. పలు కీలక విషయాలు వెల్లడించింది. 1400 కంపెనీలలో ఈ సంస్థ విశ్లేషణను జరిపింది. 40 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలతో పోలిస్తే భారత్లో జీతాలు ఎక్కువగా పెరుగుతాయని తెలిపింది. సర్వే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1. 2022లో భారత ఉద్యోగులకు 10.6 శాతం జీతాలు పెరిగాయి.
2. భారత్లో ఆర్థిక అస్థిరత, ఎక్కువ ఆట్రీషన్ రేటు ఉన్నప్పటికీ ఉద్యోగుల జీతంలో రెండంకెల వృద్ధి ఉంటుంది.
3. 2022 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా అట్రిషన్ రేటు 21.4గా నమోదైంది.
4. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి భయాలు ఉన్నప్పటికీ భారత్లో ఉద్యోగులకు బ్యాక్-టు-బ్యాక్ జీతాలు పెరుగుతాయి. 2023లో జీతాలు 10.3 శాతం మేర పెరగొచ్చు.
5. అత్యత్తమ ప్రదర్శన, కీ టాలెంట్ ఉన్న ఉద్యోగులపై సంస్థలు ఎక్కువగా ఖర్చులు చేస్తాయి.
6. బ్రెజిల్లో 7.2%, ఇండోనేషియా 6.7%, చైనా 6.3%, పిలిప్సిన్ 7.2%, మలేషియా 5.2%, సింగపుర్ 4.8% వరకు ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఉంటుంది.