తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇండియాలో రిచెస్ట్​ యూట్యూబర్​ ఇతడే- అప్పడు రూ.5వేల జీతం- ఇప్పుడు రూ.కోట్లలో సంపద - ఇండియా రిచెస్ట్ యూట్యూబర్​

Richest Youtuber in India Net Worth : ప్రస్తుత కాలంలో యూట్యాబ్​ గురించి తెలియని వారు ఉండరు. ఈ సోషల్​ మీడియా యాప్​లో తమ ప్రతిభను చూపించి అనేక మంది సెలబ్రెటీలుగా మారారు. అనేక మంది కోట్లలో ఆదాయం పొందుతున్నారు. అయితే, దేశంలోనే రిచెస్ట్​ యూట్యూబర్​ ఎవరో తెలుసా?

richest youtuber in india net worth
richest youtuber in india net worth

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 8:16 PM IST

Updated : Dec 24, 2023, 6:28 AM IST

Richest Youtuber in India Net Worth :యూట్యూబ్​ ఒక సోషల్​ మీడియా సంచలనం. అత్యంత సామాన్యులను న్యూ జనరేషన్​ డిజిటల్ సెలబ్రిటీలుగా తీర్చిదిద్దిన వేదిక ఇది. వంటల నుంచి టెక్​ న్యూస్​ వరకు, కామెడీ స్కిట్​ల నుంచి సాహస కృత్యాల వరకు అన్ని రకాల కంటెంట్ దీనిలో అందుబాటులో ఉంటుంది. నేటి కాలంలో యూట్యూబ్​ అనేది ఒక గొప్ప ఎడ్యుకేషన్​ వేదికగా కూడా పనిచేస్తోంది. ఇలాంటి వేదికను ఆసరా చేసుకుని అనేక మంది కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. మరి వీరందరిలో రిచెస్ట్ యూట్యూబర్​ ఎవరో మీకు తెలుసా? ఆయన ఎవరో తెలుసుకుందాం పదండి.

క్యారీ మినటీ, ఆశిశ్​ చంచ్లానీ, అజయ్​ నగేర్​, అమిత్ భడనా, సందీప్ మహేశ్వరి- ఇలా యూట్యూబ్ ద్వారా దేశంలో ఎంతోమంది చాలా ఫేమస్ అయ్యారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం​ కామెడీ సిరీస్​లు చేస్తూ దేశంలోనే రిచెస్ట్​ యూట్యూబర్​గా ఘనత వహించారు. ఆయనే 'బీబీ కి వైన్స్​' ఛానెల్​ యజమాని భువన్ బామ్​​. 29 ఏళ్ల భువన్​ బామ్​కు ప్రస్తుతం యూట్యూబ్​లో సుమారు 2.6 కోట్ల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈయన దాదాపు రూ.122 కోట్ల నెట్​వర్త్​తో దేశంలోనే రిచెస్ట్ యూట్యూబర్​గా పేరు సంపాదించారు. గుజరాత్​ వడోదరకు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన భువన్ ​తొలుత మ్యూజిషియన్​గా కెరీర్​ ప్రారంభించారు. కెఫే, రెస్టారెంట్లలో సంగీత ప్రదర్శన ఇచ్చేవారు. నెలకు కేవలం ఐదు వేల రూపాయలు సంపాదించేవారు. ఆ తర్వాత 2015లో యూట్యాబ్​ ఛానెల్​ను ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు.

తన యూట్యూబ్ ఛానెల్​ బీబీ కి వైన్స్​​లో మొదట చిన్న స్కిట్స్​ను అప్​లోడ్ చేసేవారు. ఆయన పోషించిన తితు మామా, బంచోద్దస్, సమీర్​ ఫుద్ది, బాంచో, బబ్లూజి అండ్ బబ్లి సర్​ లాంటి పాత్రలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. దీంతో తక్కువ సమయంలోనే దేశంలో యూట్యూబ్​లో మోస్ట్​ పాపులర్​​ అయ్యారు. ఫేమ్​ సంపాదించిన తర్వాత 2021లో సొంతంగా దిండోరా అనే ఓ కామెడీ సిరీస్​ను రూపొందించారు. భారత్​లో బిలియన్ వ్యూస్​ సంపాదించిన తొలి లిమిటెడ్​ సిరీస్​గా అది రికార్డ్ కొట్టింది. ఈ సిరీస్​లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు భువన్​ బామ్​. ఆ తర్వాత శ్రియ పిల్గౌకర్​, ప్రతమేశ్ పరబ్, దేవేన్​ భోజని, నిత్య మథుర్​తో కలిపి డిస్నీ హాట్​స్టార్​లో ఫాంటసీ కామెడీ మినీ సిరిస్​ తాజా కబర్​లో నటించారు. అమెజాన్​ ప్రైమ్​లో శ్రీశ్టి గంగూలీతో కలిసి రఫ్తా రఫ్తా అనే మరో రొమాంటిక్​ కామెడీని చేశారు. ప్లస్ మైనస్​ అనే షార్ట్​ ఫిల్మ్​కు 2019 ఫిల్మ్​ఫేర్ అవార్డును పొందారు. 2023లో మోస్ట్​ స్టైలిష్​ డిజిటల్​ ఎంటర్​టైనర్​గా ఎంపికయ్యారు.

YouTubers Failing Reasons : మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలా?.. ఈ తప్పులు చేయకండి!

పల్లెటూరి మేడమ్​ ఇంగ్లిష్ పాఠాలు- యూట్యూబ్ ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయం​!

Last Updated : Dec 24, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details