QR Based Coin Vending Machine : దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో బ్యాంకుల వద్ద ఎక్కువ క్యూ లైన్లు ఉండటంతో చాలా మంది డిజిటల్ పేమెంట్ల వైపు మొగ్గు చూపారు. దేశంలో ఎక్కడ ఉన్న వారికైనా సురక్షితంగా నగదును బదిలీ చేసే సౌకర్యం ఉండటంతో ఎక్కువ మంది డిజిటల్ పేమెంట్లను ఎంచుకున్నారు. అయితే ఈ పేమెంట్‌ల వల్ల చిల్లర సమస్యలు కొంత మేర తగ్గినా.. మిగతా చోట్ల చిల్లర తప్పని సరిగా అవసరం అవుతోంది.
కాగా, చిల్లర సమస్యను తొలగించడానికి రిజర్వ్ బ్యాంక్‌ఆఫ్ ఇండియా కాయిన్ బేస్‌డ్ క్యూఆర్ కోడ్ వెండింగ్ మెషీన్లను (క్యూసీవీఎం-QCVM) ప్రవేశపెట్టింది. వీటిని తొలుత దేశంలోని 12 నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు ఏ విధంగానైతే ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయో.. అలాగే నోట్లకు బదులు కాయిన్స్ కావాలనుకునేవారికి ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మెషిన్లలో స్క్రీన్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల కావాల్సిన నాణేలను పొందవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును చెల్లించి నాణేలు పొందొచ్చు. ఈ క్యూఆర్ కోడ్ కాయిన్ బెస్‌డ్ మెషీన్లను మొదట రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, బస్టాండ్స్.. వంటి ముఖ్యమైన కూడళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. క్యూసీవీఎంల నిర్వహణను బ్యాంకులు నిర్వహిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.
క్యూసీవీఎంలు ఎక్కడ ఉన్నాయి?
క్యూసీవీఎంలు ప్రస్తుతం దేశంలోని 12 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాలు:
- బెంగుళూరు
- చెన్నై
- దిల్లీ
- గుజరాత్
- హైదరాబాద్
- ఇండోర్
- జైపూర్
- ఝార్ఖండ్
- కోల్‌కతా
- లఖ్‌నవూ
- ముంబయి
- పుణె