తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన విదేశీ డిపాజిట్​ రేట్లు.. రూపాయి పతనానికి చెక్​ పెట్టే దిశగా.. - ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నాన్‌ రెసిడెన్షియల్‌ ఎక్స్‌టర్నల్‌

విదేశీ మారక ద్రవ్యాన్ని ముఖ్యంగా అమెరికా డాలర్ల డిపాజిట్‌ను ఆకర్షించి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఆర్‌బీఐ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. వీటికి అనుగుణంగా పలు బ్యాంకులు ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

foreign currency deposit rates
బ్యాంకులు ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌ డిపాజిట్లు

By

Published : Jul 16, 2022, 10:18 AM IST

విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని దేశీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు వీలుగా ఫారిన్‌ కరెన్సీ నాన్‌ డిపాజిట్‌ రెసిడెంట్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌) ఖాతాలను ప్రారంభించేందుకు వీలుంటుంది. వీటిల్లో ఆయా దేశాల కరెన్సీని నేరుగా డిపాజిట్‌ చేయొచ్చు. దేశంలో విదేశీ మారక నిల్వలను పెంచే దిశగా ఆర్‌బీఐ ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేందుకు అనుమతించింది.

  • ప్రభుత్వ రంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎఫ్‌సీఎన్‌ఆర్‌ ఖాతాలో అమెరికా డాలర్‌ డిపాజిట్‌పై, వివిధ కాల వ్యవధులకు వార్షిక వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 3.25 శాతంగా నిర్ణయించింది. ఈ పెంపు జులై 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఏడాది కాల వ్యవధి డిపాజిట్లపై 1.80 శాతం నుంచి 2.85 శాతానికి పెంచింది. 3-4 ఏళ్ల డిపాజిట్‌పై 3.10 శాతం, అయిదేళ్ల డిపాజిట్‌పై 3.25 శాతం వడ్డీ వర్తించనుంది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడాది నుంచి రెండేళ్ల కాల వ్యవధి ఎఫ్‌సీఎన్‌ఆర్‌ యూఎస్‌డీ (అమెరికా డాలర్‌) డిపాజిట్లపై వడ్డీని 3.35 శాతానికి చేర్చింది. ఇది జులై 9 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. సమయానుకూలంగా తమ ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్ల రేటును పెంచుతూ ఉంటామని బ్యాంకు ఈ సందర్భంగా తెలిపింది.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ 3,50,000 యూఎస్‌డీకి పైబడిన డిపాజిట్లపై వడ్డీ రేటును 0.15శాతం పెంచింది. ఈ నెల 13 నుంచి కొత్త వడ్డీ రేటు 3.50 శాతంగా పేర్కొంది. 12-24 నెలల కాల వ్యవధికి ఈ రేటు వర్తిస్తుంది.
  • ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నాన్‌ రెసిడెన్షియల్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ) ఖాతాలో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 888 రోజుల ఎఫ్‌డీపై 7.40 శాతం, 36 నెలల వ్యవధి ఆర్‌డీపై 7.30 శాతం వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది.
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1 మిలియన్‌ డాలర్లకు పైబడిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్‌పై 3.50శాతం వడ్డీని నిర్ణయించింది. ఏడాది నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. 5 ఏళ్ల డిపాజిట్‌పై 2.50శాతం వడ్డీనిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details