Petrol Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.113.61, డీజిల్ రూ.99.83కు చేరుకుంది. దేశ రాజధాని దిల్లీలో 80 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 25 పైసలకు చేరింది. డీజిల్ ధర 91 రూపాయల 51 పైసలకు పెరిగింది. ధరలు ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు పెరగడం గమనార్హం. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.115.37, డీజిల్ రూ.101.23కు ఎగబాకింది.
మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎనిమిది రోజుల్లో ఏడోసారి - petrol price
Petrol Diesel Prices: పెట్రోల్ ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. ఎనిమిది రోజుల్లో ఏడుసార్లు ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీ, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..?
పెట్రోల్ ధరలు