petrol price increased: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 50 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ డీజిల్‌పై 55 పైసలు వడ్డించాయి. దీంతో పెట్రోల్ ధర రూ.99.11కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.90.42కు ఎగబాకింది. ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఆరు రోజుల వ్యవధిలో ఐదుసార్లు ధరలు పెరిగినట్లైంది.
Mumbai Petrol price:ముంబయిలో లీటర్ పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.113.88కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.13గా ఉంది.
• తాజా బాదుడు తర్వాత.. చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90, డీజిల్ ధర రూ.95గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.108.53, డీజిల్ రూ.93.57 పలుకుతోంది.