Oil Prices Hike: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి. దాదాపు ఐదు నెలల విరామం తర్వాత ఈ నెల 22వ తేదీ నుంచి ఇప్పటివరకు ఎనిమిది సార్లు రోజువారీ ధరల మార్పు మాటున చమురు సంస్థలు ధరలను పెంచేశాయి. బుధవారం హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచాయి. పెరిగిన ధరలతో పెట్రోల్ లీటర్ ధర రూ.114.51, డీజిల్ లీటర్ ధర రూ.100.70కి ఎగబాకింది. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లో పెట్రోల్ ధర. రూ.108.20, డీజిల్ ధర రూ.94.62గా ఉండగా 8 సార్లు చమురు సంస్థలు ధరలను పెంచాయి. అంటే పెట్రోల్ లీటరుపై రూ.6.32 , డీజిల్ లీటరుపై రూ.6.08 లెక్కన ధరలు పెరిగాయి.
Petrol Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మళ్లీ పెరిగిన ధరలు - పెట్రోల్ ధర
Petrol price today: దేశంలో పెట్రో బాదుడు ఆగడం లేదు. చమురు ధరలు 9 రోజుల్లో 8 సార్లు పెరిగి సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
Diesel Price Today: ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.116.45, డీజిల్ రూ.102.27గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.25, డీజిల్ రూ.102.07కి చేరింది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర 80 పైసల చొప్పున పెరిగింది. ఫలితంగా అక్కడ లీటర్ పెట్రోల్ ధర101.01కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ. 92.27కి పెరిగింది.
ఇదీ చదవండి:ఖర్చు చేయకుండానే రూ.1000కోట్లు లెక్క.. 'హీరో' మెడకు ఐటీ ఉచ్చు!