తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ రాష్ట్ర ప్రజలు ఆదాయ పన్ను కట్టనవసరం లేదు.. ఎందుకో తెలుసా?

మీకు తెలుసా.. దేశంలోని ఓ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించట్లేదు. అది ఏ రాష్ట్రమో ఎందుకు వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదో తెలుసుకుందామా!

no-income-tax-sikkim-why-residents-of-sikkim-state-people-exempted-from-paying-taxes
ఎందుకు సిక్కిం రాష్ట్ర ప్రజలకు పన్ను మినహాయింపు

By

Published : Feb 16, 2023, 6:23 PM IST

భారత్​లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారు.. ప్రభుత్వానికి కచ్చితంగా ఆదాయ పన్ను కట్టాల్సి ఉంటుంది. ఏటా ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే బడ్జెట్​లో ఈ పన్నుకు సంబంధించిన స్లాబ్​లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే పన్ను చెల్లింపుదారులు.. ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్క సిక్కిం రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది.

దేశంలో అతి తక్కువ జనాభా గల రాష్ట్రం సిక్కిం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రాతం 22వ రాష్ట్రంగా భారత్​లో విలీనమైంది. 1975లో ఓ రెఫరెడం నిర్వహించి మరీ సిక్కింను భారత్​లో విలీనం చేశారు అప్పటి పరిపాలకులు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు.. సిక్కింను భారత్​లో విలీనం చేసేందుకు ఓ షరతు​ పెట్టారు. 1975కు ముందు.. పన్ను చెల్లింపుల్లో తాము ఎటువంటి చట్టాలు, నిబంధనలు పాటిస్తున్నామో.. భారత్​లో సిక్కిం విలీనమైన తరువాత కూడా అవే ఉండాలని సూచించారు. విలీనం అనంతరం సిక్కింకు ప్రత్యేక హోదా కొనసాగించాలని కోరారు. 1975 క్రితం నుంచే సిక్కిం తన సొంత పన్ను చట్టం-1948 అనుసరిస్తూ వస్తోంది. దీని ప్రకారమే సిక్కింలో నివాసం ఉంటున్న వారంతా కేంద్రానికి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

వారందరికీ మినహాయింపు..
2008లో కేంద్ర ప్రభుత్వం సిక్కింలో ఉన్న ఆదాయపన్ను చట్టాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలో ఆర్టికల్​ 371(ఏఫ్​)ను విధించింది. పన్ను చెల్లింపుల కోసం కొత్తగా సెక్షన్​ 10(26ఏఏఏ)ను తీసుకువచ్చింది. దీని ప్రకారం సిక్కింలో నివాసం ఉంటున్న 94 శాతం మంది ప్రజలు ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు పొందుతారు. 2008 ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్​లోనే ఈ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది ప్రభుత్వం. అయితే భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి నిరాకరించిన 500 కుటుంబాలను ఇందులో నుంచి ప్రభుత్వం మినహాయించింది. సెక్షన్​ 10(26ఏఏఏ) ప్రకారం.. ఇతర ప్రాంతాల నుంచి స్వీకరించే డివిడెండ్​, సెక్యురిటీలపై వడ్డీల వంటి విషయంలో సిక్కిం ప్రజలు పన్ను మినహాయింపు పొందుతారు.

పాన్​కార్డూ అవసరం లేదు..
స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్​ ఆఫ్​ ఇండియా(సెబీ) కూడా వీరికి కొన్ని మినహాయింపులనిచ్చింది. సాధారణంగా దేశంలో ఎవరైనా భారత స్టాక్ మార్కెట్​లలో, మ్యూచువల్ ఫండ్స్​లలో పెట్టుబడులు పెట్టినప్పుడు కచ్చితంగా పాన్​కార్డ్​ అవసరం ఉంటుంది. కానీ సిక్కిం ప్రజలకు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు పాన్​కార్డ్​ అవసరం లేదు.

కాకపోతే కేంద్ర ప్రభుత్వం.. 1975కి ముందు సిక్కింలో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఎటువంటి మినహాయింపులు ప్రకటించలేదు. వీరిని 'సిక్కిమీస్'​ నిర్వచనం నుంచి మినహాయించింది. విలీనానికి ముందు అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకున్న భారతీయులకే మినహాయింపులు ఇచ్చింది. దీంతో 1975కి ముందు సిక్కింలో నివాసం ఉంటున్న వారంతా ప్రభుత్వానికి పన్ను చెల్లిచాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వీరంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తమను 'సిక్కిమీస్' నిర్వచనం నుంచి తొలగించిందని.. దీంతో తామంతా పన్ను మినహాయింపు పొందలేకపోతున్నామని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు 2013లో తీర్పునిచ్చింది. సిక్కింలో నివాసం ఉండే ప్రతి ఒక్కరికి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు అనుగుణంగా సెక్షన్​ 10(26ఏఏఏ)ని సవరించాలని ఆదేశించింది. 2008 ఏప్రిల్​ 1 తరువాత సిక్కింయేతరులను వివాహం చేసుకున్న మహిళలు ఇచ్చే.. పన్ను మినహాయింపులకు కూడా రద్దు చేసింది.

ABOUT THE AUTHOR

...view details