Modi Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగూల్ ప్రణాళిక గురించి చర్చించారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ -GIFTలో గూగుల్ తన గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రధాని స్వాగతించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూదిల్లీలో భారత్ నిర్వహించనున్న AI సమ్మిట్‌లో.. గ్లోబల్ భాగస్వామ్యానికి సహకరించాల్సిందిగా గూగుల్‌ను మోదీ ఆహ్వానించారు.
Modi Interaction With Sundar pichai Today : అటు జీ-పే, UPI బలాన్ని, రీచ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా భారత్‌లో ఆర్థిక చేరికలను మెరుగుపరచడానికి గూగుల్ ప్రణాళికల గురించి ప్రధానికి పిచాయ్ తెలిపారు. భారత్ అభివృద్ధి పథంలో వెళ్లేందుకు గూగుల్ నిబద్ధత గురించి కూడా పిచాయ్ పేర్కొన్నారు. వర్చువల్ సమావేశం అనంతరం.. దేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో HPతో గూగుల్ భాగస్వామ్యాన్ని మోదీ అభినందించారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. గూగుల్ 100 భాషల చొరవను గుర్తించిన ప్రధాని.. భారత భాషలలో AI సాధనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ప్రోత్సహించారని పేర్కొంది. గూగుల్ సంస్థ భారత్‌లో చేపట్టిన ప్రణాళికలపై ప్రధాని మోదీతో భేటీ అద్భుతమని చెప్పారు మాతృసంస్థ సీఈఓ సుందర్ పిచాయ్.
Sundar Pichai Modi Meeting : గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దిల్లీలో కలిశారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఆవిష్కరణలు, సాంకేతికత సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సుందర్ పిచాయ్.. జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో తాము భారత్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశంలో సాంకేతికపరమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు.