Maternity Insurance Benefits :ఆస్పత్రి ఖర్చులకు పేదలే కాదు ధనికవర్గాలు సైతం హడలెత్తిపోతారు. జేబులు ఖాళీ అవ్వటం ఖాయమని ఆందోళన పడతారు. అందుకే ఈరోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్లకు డిమాండ్ పెరిగింది. అయితే కొత్తగా పెళ్లైన దంపతులు అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడుతుంటారు. దీంతో వారికి ప్రసూతి సమయంలో అయ్యే ఖర్చులు ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి. అందుకే మెటర్నిటీ కవరేజ్ ఉన్న మంచి ఆరోగ్య బీమాను తీసుకోవాలి. అందులో ప్రసవానంతర వైద్య ఖర్చులతో పాటు, నవజాత శిశువులకు చికిత్స ఉందా లేదా సరిచూసుకోవాలి. సరైన పాలసీని ఎంచుకోవడం వల్ల డెలివరీ సమయంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులకు దాదాపు అడ్డుకట్ట వేయవచ్చు.
Health Insurance Maternity Cover :ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి, ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల సరోగసీ (అద్దె గర్భం), ఐవీఎఫ్ వైపు మళ్లే దంపతుల సంఖ్య సైతం పెరుగుతోంది. అయితే ఈ ప్రక్రియ చాలా ఖరీదైంది. అందుకే చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం డెలివరీ కవరేజ్‌ను మాత్రమే అందిస్తాయి. అందుకే మనం తీసుకునే ఆరోగ్య బీమాలో సరోగసీ, ఐవీఎఫ్ వంటి పద్ధతులకు కూడా కవరేజ్ ఉండేలా చూసుకుంటే మరింత మంచిది.
పాలసీ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!
ఆస్పత్రి నెట్వర్క్
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మంచి పేరున్న ఆస్పత్రులు అందులో భాగంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. మంచి ఆస్పత్రుల నెట్వర్క్ కలిగిన పాలసీలనే తీసుకోండి. దానివల్ల ప్రసూతి సమయంలో ఆస్పత్రిలో చేరటం తేలికవుతుంది.
వెయిటింగ్ పీరియడ్
Health Insurance Maternity Waiting Period :అదేవిధంగా బీమా కంపెనీ వెయిటింగ్ పీరియడ్‌ను ఒకసారి గమనించండి. మీరు ఒక సంవత్సరం తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే కంపెనీ వెయిటింగ్ పీరియడ్ ఒకవేళ నాలుగేళ్లు ఉంటే, ఆ సమయంలో ప్రసూతి మీ ఇన్సూరెన్స్ చెల్లదు. కనుక ఈ విషయాన్ని సరిచూసుకుని పాలసీ తీసుకొండి. కొన్న ప్లాన్లలో ఎన్ని ప్రెగ్నెన్సీలకు బీమా కవరేజ్ వర్తిస్తుంది అనే దానిపై ప్రత్యేక నింబంధనలు ఉంటాయి.