Massive Discount on Mahindra XUV 400 Electric Car : పండగ సీజన్లోకొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా కొన్ని మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అందులో భాగంగానే తమ కంపెనీ నుంచి తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400)పై ఏకంగా రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Diwali 2023 Massive Offers on Mahindra Cars :ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో మహీంద్రా (Mahindra Auto) కంపెనీ తన తొలి ఎస్యూవీ ఎలక్ట్రిక్ కారు XUV 4000ను ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో దీపావళి(Diwali 2023) సందర్భంగా మహీంద్రా తన ఎలక్ట్రిక్ కారు XUV 400పై రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధరను రూ.15.99 లక్షలుగా ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి ధర ఉంటుంది.
ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం..దివాళీ సీజన్ సందర్భంగా డీలర్లు టాప్-స్పెక్ EL వేరియంట్‌పై రూ. 3.5 లక్షల వరకు, ESCతో కూడిన EL వేరియంట్‌పై రూ. 3 లక్షల వరకు, అలాగే లోయర్-స్పెక్ EC trimపై రూ. 1.5 లక్షల వరకు నగదు తగ్గింపులను అందిస్తున్నారు. ఈ మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV కారు ఆటో ఎక్స్పో 2021లో ప్రదర్శనకు ఉంచిన eXUV300 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ కొత్త మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV కారు ప్రస్తుత మార్కెట్లో టాటా నెక్సాన్ EV, MG ZS EV వంటి వాటితో పోటీపడుతుంది.
మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ SUV డిజైన్:
- మహీంద్రా XUV 400 పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాతో కొత్త హెడ్లైట్లతో ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్, క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది.
- ఈ కారు ముందు భాగంలో కాపర్ ట్విన్ పీక్స్ లోగోను కూడా కలిగి ఉంది.
- ఇది విశాలమైన C-సెగ్మెంట్ e-SUV.
- ఈ కొత్త EV ప్రత్యేకమైన కాపర్ ఇన్సర్ట్లు, పియానో-బ్లాక్, డైమండ్ కట్ 16" అల్లాయ్ వీల్స్‌తో అధిక కాంట్రాస్ట్ సర్ఫేస్ ట్రీట్మెంట్తో వస్తుంది.
- ఈ కారు శాటిన్ కాపర్ ఇన్సర్ట్లతో కూడిన ఎలక్ట్రిక్ టెయిల్ ల్యాంప్‌లను కూడా కలిగి ఉంది.