తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్ స్కోర్​ రిపోర్ట్​లో తప్పులా? ఇలా చేయండి! - క్రెడిట్ స్కోర్ రాంగ్ ఇన్ఫర్మేషన్

Correct Credit score mistakes : క్రెడిట్‌ కార్డు వాడుతుంటాం.. రుణాలకు వాయిదాలు చెల్లిస్తాం. కానీ, ఈ లావాదేవీలన్నీ సరిగ్గా నమోదవుతున్నాయా? చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కొత్తగా రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు.. బ్యాంకులు రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరును, నివేదికను పరిశీలిస్తుంటాయి. మీరు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నప్పటికీ.. నివేదికలో కనిపించకపోవచ్చు. తీసుకోని ఒక అప్పు మీ స్కోరును తగ్గించేయొచ్చు. మరి, ఇలాంటి పొరపాట్లు దొర్లినప్పుడు ఈ నివేదికను ఎలా సరిచేసుకోవాలి?

credit score report
క్రెడిట్ స్కోర్​ రిపోర్ట్​లో తప్పులా? ఇలా చేయండి!

By

Published : Dec 2, 2022, 7:50 AM IST

డ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి బ్యాంకులు 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీలో రాయితీనిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నప్పుడు అరశాతం వడ్డీ తక్కువ ఉన్నా.. భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ నివేదిక, స్కోరు కీలకంగా మారుతున్నాయి. రుణాలు, వాటిని చెల్లిస్తున్న తీరు, క్రెడిట్‌ కార్డు బిల్లులు, రుణాల కోసం చేసిన విచారణలు, బ్యాంకు ఖాతాల సంఖ్య ఇలాంటి ఎన్నో వివరాలు క్రెడిట్‌ నివేదికలో కనిపిస్తుంటాయి.

Credit score wrong information : నివేదికను పరిశీలించేటప్పుడు ముందుగా మీ పేరు, పాన్‌, మొబైల్‌, ఇ-మెయిల్‌, బ్యాంకు ఖాతాల వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. మీరు రద్దు చేసుకున్న ఖాతాల వివరాలు, తీర్చేసిన అప్పులూ ఇందులో కనిపిస్తాయి. కాబట్టి, ఒకటికి రెండుసార్లు ఈ వివరాలను తనిఖీ చేసుకోవాలి. అవన్నీ మీకు సంబంధించనవేనా.. పొరపాట్లు ఏమైనా ఉన్నాయా పరిశీలించాలి.

మీరు ఎప్పుడూ తీసుకోని రుణం, మీ పేరుపై రుణ విచారణలు, ఈఎంఐలు సకాలంలో చెల్లించినప్పటికీ 'డిఫాల్ట్‌'గా చూపించడం ఈఎంఐ మొత్తంలో వ్యత్యాసం, చిరునామా, పేరులో వ్యత్యాసాలను గుర్తిస్తే మీరు వెంటనే చర్యలు చేపట్టాలి. ముందుగా క్రెడిట్‌ బ్యూరోకు మీరు గమనించిన వ్యత్యాసాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. నివేదికను సరిచేయాల్సిందిగా కోరవచ్చు. ఇప్పుడు ఒకటికి మించి క్రెడిట్‌ బ్యూరోలు స్కోరును అందిస్తున్నాయి. బ్యాంకులు సాధారణంగా సిబిల్‌ స్కోరును పరిశీలిస్తుంటాయి. మిగతా బ్యూరోల్లో నమోదైన వివరాలనూ మీరు చూసుకోండి. వ్యక్తిగతంగా క్రెడిట్‌ స్కోరును తెలుసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. తప్పులు దొర్లినప్పుడు ఆయా వివరాలకు సంబంధించిన ఆధారాలను క్రెడిట్‌ బ్యూరోలకు అందిస్తే చాలా సందర్భాల్లో నివేదికలో మార్పులు చేస్తాయి.

Correct Credit score mistakes : కొన్నిసార్లు బ్యాంకు లేదా క్రెడిట్‌ కార్డు సంస్థను సంప్రదించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు తదితర సమాచారాలను సరి చేయాలంటే.. బ్యాంకులకే సాధ్యం. మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే.. ఆయా క్రెడిట్‌ బ్యూరోల వెబ్‌సైటులోనే ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా ఈ వ్యత్యాసాలను సరిచేసేందుకు 30-45 రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ వ్యవధే పడుతుంది. క్రెడిట్‌ బ్యూరోలు చూపించిన పరిష్కారంతో మీరు సంతృప్తి చెందకపోతే, మరోసారి ఫిర్యాదు చేయొచ్చు.

Credit rating mistakes : అప్పు చేసి, వాయిదాలు చెల్లిస్తున్న వారందరూ క్రమం తప్పకుండా క్రెడిట్‌ నివేదిక, స్కోరును పరిశీలిస్తూ ఉండాలి. కొన్ని సంస్థలు నెలవారీ నివేదికలను ఉచితంగానే అందిస్తున్నాయి. పేరున్న సంస్థలను ఎంచుకొని, మీ నివేదికలను చూసుకోవచ్చు. ముందే అనుకున్నట్లు దీనివల్ల క్రెడిట్‌ స్కోరుకు ఇబ్బందేమీ ఉండదు. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండటం వల్ల తప్పులు దొర్లినప్పుడు వెంటనే రుణదాతలకు ఆ తప్పులను నివేదించి, సరిచేసుకునేందుకు వీలవుతుంది. మీ వివరాలు సరైనవే అని తేలితే, వెంటనే వారు క్రెడిట్‌ బ్యూరోలకు సమాచారం ఇస్తారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతరుల గుర్తింపు ధ్రువీకరణలతో మోసగాళ్లు క్రెడిట్‌ కార్డులు, రుణాలు తీసుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. కాబట్టి, మనం అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. క్రెడిట్‌ నివేదికలో పొరపాట్లు దొర్లకుండా ఆపలేం. కానీ, వాటిని వీలైనంత త్వరగా సరిదిద్దుకోవడంలో మాత్రం ఆలస్యం చేయొద్దు.

ABOUT THE AUTHOR

...view details