Jio Bharat B1 4g Mobile Specifications :జియోభారత్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది రిలయన్స్ జియో.జియోభారత్ బీ1 పేరుతో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. గతంలో ఉన్న వీ2, కే1 కార్బన్ మోడళ్ల కంటే కొన్ని ఎక్కవ ఫీచర్లతో ఇందులో ప్రవేశపెట్టింది. కంపెనీ వెబ్‌సైట్‌లో దీన్ని జియోభారత్ బీ1 సిరీస్ కింద ప్రత్యేకంగా లిస్ట్ చేసింది రిలయన్స్ జియో. ఇదొక 4జీ మొబైల్. క్రితం మోడల్ ఫోన్లతో పోలిస్తే స్క్రీన్ కొంచెం పెద్దదిగా ఉంటుంది.
Jio Bharat Phone UPI Payment :జియోభారత్ బీ1 ఫోన్ ధర 1299 రూపాయలుగా ఉంది. 2.4 అంగళాల తెర, 2,000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఇది నడుస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే ఈ రెండు అంశాల్లో మొబైల్ మెరుగుపరిచారు. ఈ ఫోన్ వెనక భాగంలో కెమెరా కూడా ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను తన వెబసైట్లో ఫోస్ట్ చేసింది జియో. కానీ, అది ఎన్ని మెగాపిక్సెల్ అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ ఫోన్‌లో జియో యాప్స్ అన్నీ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయని కంపెనీ వెల్లడించింది. యూపీఐ పేమెంట్స్ కోసం ఇందులో జియోపే కూడా ఉన్నట్లు పేర్కొంది. 23 భాషలకు ఇది సపోర్ట్ చేస్తుందని వివరించింది. అయితే ఇందులో జియోయేతర సిమ్‌లను ఉపయోగించడం మాత్రం కుదరదు. కేవలం నలుపు రంగులో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇది జియో వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కూడా లభిస్తోంది.