తెలంగాణ

telangana

ETV Bharat / business

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం - చిన్న మొత్తాల పొదుపు పథకాలు

small savings schemes interest rates: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్​ఎస్​సీ, పీపీఎఫ్​ సహా ఇతర పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే, ఏ పథకంపై ఎంత వడ్డీ రేటు వస్తుందో తెలుసుకుందాం.

small savings schemes
చిన్న మొత్తాల పొదుపు పథకాలు

By

Published : Mar 31, 2022, 6:00 PM IST

small savings schemes interest rates: నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​(ఎన్​ఎస్​సీ), పబ్లిక్​ ప్రొవిడెంట్​ ఫండ్​(పీపీఎఫ్)​ సహా మిగతా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయని తెలిపింది. 2020-21 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం నుంచి వీటిపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవటం గమనార్హం. తాజా నిర్ణయంతో పీపీఎఫ్​, ఎన్​ఎస్​సీలపై తొలి త్రైమాసికంలో వడ్డీ రేటు వరుసగా 7.1శాతం, 6.8 శాతంగా కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

"2022, ఏప్రిల్​ 1న మొదలై.. 2022, జూన్​ 30న ముగియనున్న తొలి త్రైమాసికానికి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయి. 2021-22 ఆర్థిక ఏడాది చివరి త్రైమాసికంలో అమలవుతున్న వడ్డీ రేట్లే ఇప్పుడూ వర్తిస్తాయి."

- కేంద్రం ఆర్థిక శాఖ.

పథకం వడ్డీ రేటు% వడ్డీ జమ/చెల్లింపు వ్యవధి
పీపీఎఫ్ 7.1 ఏడాదికోసారి
ఎన్​ఎస్​సీ 6.8 ఏడాదికోసారి
ఏడాది టర్మ్​ డిపాజిట్​ 5.5 మూడు నెలలకోసారి
సుకన్య సమృద్ధి యోజన 7.6 మూడు నెలలకోసారి
ఐదేళ్ల వయోవృద్ధుల పొదుపు పథకం 7.4 మూడు నెలలకోసారి
పొదుపు ఖాతాలపై 4 ఏడాదికోసారి
1-5 ఏళ్ల టర్మ్​ డిపాజిట్లు 5.6-6.7 మూడునెలలకోసారి
ఐదేళ్ల రికరింగ్​ డిపాజిట్లు 5.8 మూడు నెలలకోసారి

ఇదీ చూడండి:ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​- డీఏ పెంపు

ABOUT THE AUTHOR

...view details