ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌కు.. భారతీయుడు నీల్ మోహన్ సీఈఓగా నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా.. సీఈఓగా ఉన్న సూసన్ వొజిసికి తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తన బ్లాగ్‌పోస్టులో పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్‌లో చేరినప్పుడు అద్భుతమైన నాయక బృందాన్ని తీసుకురావాలనేది తన మొదటి ప్రాధాన్యమని సూసన్ తెలిపారు. నీల్ మోహన్ అందులో ఒకరని వెల్లడించారు.
టాప్ కంపెనీల్లో భారతీయుల హవా.. యూట్యూబ్ CEOగా నీల్ మోహన్
దిగ్గజ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్‌కు.. భారతీయుడు నీల్ మోహన్ సీఈఓగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తుతం సీఈఓగా ఉన్న సూసన్ వొజిసికి స్వయంగా వెల్లడించారు.
ఇండో అమెరికన్ అయిన నీల్ మోహన్ 2007లో గూగుల్‌లో చేరి.. క్రమంగా ఎదుగుతూ 2015 నాటికి యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అయ్యారు. యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, షార్ట్స్ వంటి కొత్త ఉత్పత్తులను తీసుకురావడంలో నీల్ కీలక పాత్ర పోషించారని సూసన్ తెలిపారు. తమ వ్యాపారం, ఉత్పత్తులు, ఉద్యోగులపై.. నీల్‌కు మంచి అవగాహన ఉందని వెల్లడించారు. నీల్ యూట్యూబ్‌కు అద్భుతమైన నాయకుడిగా ఉంటారని సూసన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కుటుంబం, ఆరోగ్యం, కొన్ని వక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించేందుకు యూట్యూబ్ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు సూసన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఒకరోజు ముందుగానే ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేసినట్లు ఆమె తెలిపారు. ఉద్యోగుల అవసరాలను తీర్చడంలో, యూట్యూబ్‌ను ముందుకు తీసుకువెళ్లడంలో నీల్ మోహన్ ముందుంటారని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నీల్ యూట్యూబ్‌కు అద్భుతమైన నాయకుడిగా ఉంటారని సూసన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కొత్త సీఈఓకు కొంత కాలం పాటు సహాయంగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. గతంలో యూట్యూబ్ సీఈఓగా నియమితులవ్వడం తనకు దక్కిన అరుదైన గౌరవం అని ఆమె అన్నారు. దీంతో పాటుగా కొన్ని సార్లు ఉద్యోగులతో కలిసి కూర్చున్నప్పుడు వారు చెప్పేది కఠినంగా ఉన్నా సరే నిజాయితీ ఉండేవని ఆమె తన పోస్ట్‌లో తెలిపారు. తనకు ఇంతకాలం మద్దతుగా నిలిచిన ఉద్యోగులకు, ప్రజలకు సూసన్ వొజిసికి ధన్యవాదాలు తెలిపారు.