If You Fill Petrol in Diesel Car What Happen :వాహనాల్లో.. డీజిల్‌తో నడిచేవి కొన్ని, పెట్రోల్‌తో నడిచేవి మరికొన్ని ఉన్నాయని మనకు తెలుసు. ఏ ఇంధనంతో నడిచే వాహనంలో.. అదే పోయాలని కూడా అందరికీ తెలుసు. అయితే.. బంకుల్లో పొరపాటుగా ఒక ఇంధనంతో నడిచే వాహనంలో.. మరో ఇంధనం నింపే అవకాశం ఉంటుంది. మరి, అలా చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా..?
పెట్రోల్ కారులో డీజిల్ నింపితే..?
పెట్రోల్ కారులో డీజిల్ నింపడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్ కంటే.. డీజిల్‌ను ఎక్కువగా శుద్ధిచేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కానీ.. డీజిల్ కార్లలో పెట్రోల్ నింపితే మాత్రం సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. డీజిల్ కారులో డీజిలే పోసినప్పుడు.. అది లూబ్రికేషన్ ఆయిల్‌గా కూడా పనిచేస్తుంది. దానివల్ల.. ఇంజిన్ భాగాలు సాఫీగా పనిచేస్తాయి. కానీ.. అందులో పెట్రోల్ పోస్తే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటికే అందులో ఉన్న డీజిల్‌తో పెట్రోల్ కలిసిపోయి.. ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
డీజిల్ ఇంజిన్‌లో పెట్రోల్ కలవడం వల్ల.. కారులోని యంత్ర భాగాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఈ సమయంలో ఇంజిన్ ఆన్‌లో ఉన్నా.. కారు వాహనాన్ని డ్రైవ్ చేసినా.. ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం లేదా ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి.. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Top 5 Turbo Petrol Cars Under 15 Lakh : దీపావళికి మంచి కారు కొనాలా?.. రూ.15 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్స్ ఇవే!
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మీ కారులో డీజిల్‌కు బదులుగా పెట్రోల్ నింపినట్లయితే.. కారును స్టార్ట్ చేసే ముందే ఈ విషయాన్ని గుర్తిస్తే ఇంజిన్‌ను స్టార్ట్ చేయవద్దు.
- ఇంజిన్ స్టార్ట్ చేయడం వల్ల.. ఇంధనం ఇంజిన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది.
- ఇది ఇంజిన్‌కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే.. ఇంధనం నింపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
- ఒకవేళ పొరపాటు జరిగితే.. వెంటనే ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బందికి చెప్పాలి. ఎందుకంటే ఇలాంటప్పుడు ఏం చేయాలో వారికి అవగాహన ఉంటుంది.
- డీజిల్ కారులో పెట్రోల్ నింపినట్లు గుర్తించిన వెంటనే.. ఆ ఇంధనాన్ని వీలైనంత త్వరగా బయటకు తీసే ప్రయత్నం చేయాలి.
- పూర్తిగా పెట్రోల్ బయటకు తీసిన తర్వాత.. డీజిల్ నింపాలి. ఆ తర్వాతే కారును స్టార్ట్ చేయాలి. కొంత సమయం ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచాలి.
- అనంతరం వెంటనే సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లి.. కారు ఇంజిన్‌ను తనిఖీ చేయించాలి.
- అలా కాకుండా.. ఇంజిన్ పనితీరు స్మూత్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందని సొంత నిర్ణయం తీసుకోకూడదు. నిపుణులకు చూపించకుండా ఉండకూడదు.
- లేదంటే.. తర్వాత మరమ్మతు కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇంజిన్ లైఫ్ చాలా తగ్గిపోవచ్చు.
Tata Waiting Period October 2023 : టాటా కారు బుక్ చేశారా?.. డెలివరీకి ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాలంటే..
Top 7 Safest Cars In India (Test Proven) : క్రాష్ టెస్టులో సూపర్ విక్టరీ.. 5 స్టార్ రేటింగ్ సాధించిన కార్లు ఇవే!
TATA Safari Harrier Facelift Price and Features : టాటా నుంచి సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు.. ధర, ఫీచర్స్ చూస్తారా..?