టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ టెక్ కంపెనీ ఐబీఎఎమ్ చేరింది. ఈ సంస్థ దాదాపు 3,900 ఉద్యోగాలకు కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు ఐబీఎమ్‌లో ఉన్న 2,80,000 ఉద్యోగుల్లో 1.4 శాతమని సమాచారం.
గత డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ 1 బిలియన్ యూఎస్ డాలర్ల మేరకు నష్టాలు చవిచూసింది. ఐబీఎమ్, ఐటీ సేవల కంపెనీ కిండ్రిల్ హోల్డింగ్స్‌పై భారం పడుతుండడమే ఈ తొలగింపులు చేపట్టడానికి కారణంగా ఐబీఎమ్ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.
IBM ఉద్యోగులకు షాక్.. 3,900 జాబ్స్ కట్! - ఐబీఎమ్ తొలగింపులు 2023
ఐటీ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎమ్ 3,900 ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక అనిశ్చితి, మాంద్యం తప్పదేమోనన్న భయాలతో టెక్ కంపెనీలు ఖర్చులకు వెనకాడుతున్నాయి. అందులో భాగంగానే ఉద్యోగాలకు కోత విధిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోంది. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్, క్లౌడ్ సేవల డిమాండ్ తగ్గపోవడం వల్ల, మంగళవారం ఈ కంపెనీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇంతక ముందు ట్విట్టర్, అమెజాన్, మెటా లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి.