Hyundai Car Discounts In September 2023 : కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెప్టెంబర్ మాసంలో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కస్టమర్లను ఆకర్షించేందుకు తమ బ్రాండెడ్ కార్లను భారీ తగ్గింపు ధరలతో అందిస్తోంది.
టాప్ మోడల్స్
హ్యుందాయ్ ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌పై మాత్రమే డిస్కౌంట్స్ అందిస్తోంది. అవి ఏమిటంటే.. Grand i10 Nios, Aura, i20, Verna, Alcazar, Kona EV. ఇప్పుడు వీటిపై ఇస్తున్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Grand i10 Nios Discount : హ్యుందాయ్ కంపెనీ.. గ్రాండ్ ఐ10 నియోస్ వేరియంట్స్ అన్నింటిపై రూ.3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కింద రూ.10,000 ఇస్తోంది. పైగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్‌పై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ కల్పిస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. Grand i10 Nios కార్లపై రూ.43,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఆటోమేటిక్ వేరియంట్స్‌పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్ అందించడం లేదు.
Grand i10 Nios Price : ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్ (హ్యాచ్‌బ్యాక్) ధరలు రూ.5.73 లక్షల నుంచి రూ.8.51 లక్షల (ఎక్స్ షోరూం) ప్రైస్ రేంజ్లో ఉన్నాయి.
Grand i10 Nios డిస్కౌంట్స్ | MT | AT |
క్యాష్ డిస్కౌంట్ | రూ.30,000 | N.A |
ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ.10,000 | రూ.10,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ | రూ.3,000 వరకు | రూ.3,000 వరకు |
టోటల్ బెనిఫిట్ | రూ.43,000 వరకు | రూ.13,000 వరకు |
Aura Discounts :
- హ్యుందాయ్ ఆరా కార్ అన్ని వేరియంట్స్‌పై ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ రూ.10,000; కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 అందిస్తున్నారు.
- పెట్రోల్ వేరియంట్ ఆరా కారుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10,000, సీఎన్జీ వేరియంట్ ఆరా కారుపై రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు.
- ఆఫర్లు అన్నీ కలుపుకుంటే.. సీఎన్జీ ఆరా కార్లపై రూ.33,000 వరకు; పెట్రోల్ వేరియంట్ ఆరా కార్లపై రూ.23,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Aura Price : హ్యుందాయ్ ఆరా కారు ధరలు రూ.6.33 లక్షల నుంచి రూ.8.90 లక్షలు (ఎక్స్- షోరూం) రేంజ్లో ఉన్నాయి.
Aura డిస్కౌంట్స్ | సీఎన్జీ | ఇతర వేరియంట్స్ |
క్యాష్ డిస్కౌంట్ | రూ.20,000 | రూ.10,000 |
ఎక్స్ఛేంజ్ బోనస్ | రూ.10,000 | రూ.10,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ | రూ.3,000 వరకు | రూ.3,000 |
టోటల్ బెనిఫిట్ | రూ.33,000 వరకు | రూ.23,000 |
i20 Discount : కొరియన్ కంపెనీ హ్యుందాయ్ ఐ20 కార్ అన్ని వేరియంట్లపై.. ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.10,000 అందిస్తోంది. అలాగే DCT, Sportz MT, ఇతర వేరియంట్లపై వరుసగా రూ.30,000; రూ.25,000; రూ.10,000 చొప్పున క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తోంది.