How To Renegotiate Home Loan EMIs Rise :ఇల్లు కొనాలంటే.. లక్షల రూపాయలు అవసరం అవుతాయి. అయితే.. అంత పెద్ద మొత్తంలో డబ్బు సర్దుబాటు చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసమే.. బ్యాంకులుగృహ రుణాలు అందిస్తుంటాయి. EMIల రూపంలో తిరిగి నెలవారీ చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయి. అయితే.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ గత కొంత కాలంగా రెపోరేట్లను పెంచుతూ వస్తోంది. దీనివల్ల గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఫలితంగా చెల్లించాల్సిన సొమ్ము పెరిగిపోతుంది. దీంతో.. 15 లక్షలు చెల్లించాల్సింది కాస్తా.. పాతిక లక్షల దాకా చేరిపోవచ్చు. అయితే.. మీకున్న ఆర్థిక పరిస్థితి.. పెరిగిన EMI చెల్లించేందుకు అనుకూలంగా లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో.. రుణ చెల్లింపు కాల వ్యవధిని పెంచుకోవచ్చు. అంటే.. EMI చెల్లించే నెలలు పెరుగుతాయి. నెలవారీగా చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది. అది ఎలాగో ఈ స్టోరీలో తెలసుకుందాం.
హోమ్ లోన్ EMI ఎందుకు పెరుగుతుంది..?
గృహ రుణం ఎందుకు పెరుగుతుంది? అనే అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఇటీవల వెల్లడైన ఒక పరిశోధన ప్రకారం.. 2021లో రూ.30 లక్షల వరకు ఉండే హోమ్‌లోన్ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు 6.7 శాతం ఉండేవి. ఇప్పుడు అవి దాదాపు 9.15 శాతానికి పెరిగినట్టు అంచనా. దీంతో హోమ్‌లోన్ EMIలు పెరిగాయి. అంటే 2021 జూలై నెలలో ఒక వ్యక్తి సుమారు రూ. 22,700 లను EMI గా చెల్లిస్తే.. ప్రస్తుతం గృహ రుణగ్రహీత దాదాపు రూ. 27,300 చెల్లిస్తున్నారట. అంటే నెలకు రూ. 4,600లను అదనంగా చెల్లిస్తున్నారు. ఈఎంఐలో 20 శాతం పెరుగుదల వల్ల దాదాపు రూ.11 లక్షల మొత్తం వడ్డీ భారం పెరిగింది.
ఇలా.. పెరిగిన EMIల భారం వల్ల.. కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కొందరు EMIలను పెంచుకుంటారు. దీనివల్ల.. గృహ రుణ చెల్లింపు ఆలస్యమైన కానీ.. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుందని భావిస్తారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండి.. హోమ్‌లోన్ కాల వ్యవధిని పెంచుకోవాలని భావిస్తే.. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
'హోం లోన్' భారంగా మారిందా.. ఈ జాగ్రత్తలతో ఈజీగా!
ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి..
మీరు EMIల చెల్లింపు వాయిదాలను పొడిగించుకోవాలనుకుంటే.. ముందు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోండి. అసలు ఎందుకు EMIలు పెరుగుతున్నాయి.. దానికి గల కారణాలను అర్థం చేసుకోండి. కొన్ని సార్లు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం వల్ల కూడా ఈఎంఐలు భారం కావచ్చు.