తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Pay Self With Google Pay: గూగుల్​ పేతో సెల్ఫ్​ ట్రాన్స్​ఫర్​ ఎలా..? ఎన్ని అకౌంట్లు యాడ్ చేయొచ్చు? - Balance Check

How to pay self with GPay: మనీ ట్రాన్స్​ఫర్ చేసే సూపర్ యాప్స్​లో Google Pay ప్రముఖమైనది. మిలియన్ల మంది ప్రజలు నిత్యం వినియోగిస్తుంటారు. అయితే.. Gpayలో ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు యాడ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఈ అకౌంట్ల మధ్యనే.. మనీ ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు అనే సంగతి తెలుసా? ఇందుకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

How Many Accounts can add in Gpay
How to Pay Self With Google Pay

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 2:42 PM IST

Updated : Sep 1, 2023, 3:11 PM IST

How to pay self with Google Pay App: ఈ డిజిటల్ యుగంలో ఆన్​లైన్​ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా.. మన అకౌంట్లో డబ్బులు వేసుకోవాలన్నా.. ఇంకా బ్యాంకింగ్ సేవలు ఏది పొందాలన్నా సరే.. బ్యాంకు వద్దకు వెళ్లాల్సి వచ్చేది. వినియోగదారుల రద్దీతో గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. కానీ.. సాంకేతికత కారణంగా బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని పనులూ జరిగిపోతున్నాయి. డబ్బులు సెండ్ చేయాలన్నా.. రిసీవ్ చేసుకోవాలన్నా.. బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలన్నా.. ఇలా ఏదైనా సరే మన మొబైల్ లో UPI ద్వారా క్షణాల్లోనే జరిగిపోతోంది.

How to Recharge FASTag With Google Pay: ఇప్పుడు Gpayతో క్షణాల్లో ఫాస్టాగ్​ రీఛార్జ్.. ట్రై చేశారా..?

జనాలు అధికంగా వినియోగిస్తున్న UPIలలో గూగుల్ పే ముందు వరసలో ఉంటుంది. అయితే.. గూగుల్ పేకు ఒక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారని తెలుసు. కానీ.. రెండు.. అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలను కూడా యాడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అంతేకాదు.. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్​కు డబ్బులను మనమే సెల్ఫ్ ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసా? మీరు Google Pay యూజర్ అయ్యుంటే.. డబ్బులను ఒక కౌంట్ నుంచి మరో అకౌంట్​లోకి ట్రాన్స్​ఫర్​ చేయడం ఎలా అన్నది తెలుసుకోవాలంటే.. ఈ స్టెప్స్​ ఫాలో అవ్వాల్సిందే.

How to Book Gas Cylinder Using Gpay : గూగుల్ పే ఉపయోగించి గ్యాస్ సిలిండర్​ బుక్​ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

గూగుల్ పేలో బ్యాంక్ ఖాతా జోడించటం ఎలా..?
How to Add Bank Account in Google Pay:

  • ముందుగా వినియోగదారులు Google Pay యాప్ ను డౌన్​లోడ్ చేసుకొని.. యాక్టివేట్ చేయాలి.
  • ఆ తర్వాత ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయాలి.
  • బ్యాంక్ ఖాతాను జోడించే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అక్కడ అన్ని బ్యాంకుల పేర్లు సూచిస్తుంది.
  • ఆ జాబితా నుండి మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉందో ఆ బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.
  • మీ ఖాతా ధ్రువీకరించబడిన తర్వాత.. తప్పనిసరిగా డెబిట్ కార్డ్ సమాచారాన్ని నమోదు చేయాలి.
  • అంతటితో.. బ్యాంక్ ఖాతా గూగుల్ పేలో యాడ్ అవుతుంది.
  • ప్రొఫైల్ ఫొటో మీద క్లిక్ చేస్తే.. మీ బ్యాంకు అకౌంట్ యాడ్ చేసినట్టు కనిపిస్తుంది.
  • దాని కిందనే "యాడ్ బ్యాంక్ అకౌంట్" మళ్లీ కనిపిస్తుంది.
  • దాన్ని క్లిక్ చేసి.. రెండో అకౌంట్ ను యాడ్ చేసుకోవచ్చు.

రెండు అకౌంట్ల మధ్య మనీ ట్రాన్స్ ఫర్ చేయడమెలా?
How to Transfer Money Between Two Accounts in Google Pay:

  • ముందుగా గూగుల్​ పే యాప్​ను ఓపెన్​ చేయండి.
  • అక్కడున్న ఐకాన్స్​లో.. రెండో వరసలో కనిపించే Self Transfer ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి.
  • ఇక్కడ మీకు..Gpayకు యాడ్ చేసిన అకౌంట్లన్నీ కనిపిస్తాయి.
  • ఇప్పుడు.. ఎందులో నుంచి డబ్బు పంపించాలో ముందుగా ఆ బ్యాంక్ అకౌంట్​ సెలక్ట్ చేయాలి.
  • ఆ తర్వాత రిసీవ్ చేసుకునే బ్యాంకు ఖాతాను సెలక్ట్ చేయాలి.
  • ఇప్పుడు మీరు బదిలీ చేయాలనుకున్న అమౌంట్​ను ఎంటర్​ చేయాలి.
  • చివరగా మీరు చెల్లించడానికి Proceed ఆప్షన్​ క్లిక్​ చేయాలి.
  • మీరు అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత.. డబ్బు ట్రాన్స్​ఫర్ అయ్యిందా? లేదా? అన్నది తనిఖీ చేయవచ్చు.
  • Google పేలో బ్యాలెన్స్‌ చెక్ చేయడానికి.. హోమ్ పేజీలో 'Balance Check' పై ట్యాప్ చేయాలి.
  • బ్యాంకును ఎంచుకున్న తర్వాత మీరు మీ UPI పిన్‌ని నమోదు చేయాలి.
  • అంతే.. మీ అకౌంట్​లో ఉన్న బ్యాలెన్స్ వెంటనే​ స్క్రీన్​ మీద కనిపిస్తుంది.

How to Fix Google Pay Not Working : మీ "Google Pay" పనిచేయట్లేదా.. ఈ టిప్స్​తో సింపుల్​గా పరిష్కరించుకోండి!

How to Earn Google Opinion Rewards : గూగుల్ యాప్​తో ఫ్రీగా డబ్బు.. 10 సెకన్లలోనే ఖాతాలోకి.. ఏం చేయాలంటే..

Last Updated : Sep 1, 2023, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details