How To Open Fixed Deposit in the Name Of Minor in Banks : ప్రస్తుతం కాలంతో పాటు ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దానికితోడు రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో సంపాదన ఎంత అని అడిగేవాళ్లు. కానీ, ఇప్పుడు సంపాదన మాట పక్కన పెట్టి.. ఎంత పొదుపు చేశారు? ఏ రకంగా సేవ్ చేశారు? అనే ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి భవిష్యత్తు అవసరాలను గుర్తించి బ్యాంకుల్లోఫిక్స్డ్ డిపాజిట్(FD) లేదా రికరింగ్ డిపాజిట్(RD) చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పాన్ కార్డు లేని మైనర్ పిల్లల పేరు మీద ఏదైనా డిపాజిట్ చేయాలంటే కచ్చితంగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లల పేరు మీదు బ్యాంకు ఎఫ్డీ లేదా ఆర్డీ అకౌంట్ తీసుకోవాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
How to Invest in Bank FD in The Name of Minor Child :బ్యాంకులో చిన్న పిల్లల పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే.. ముఖ్యంగా తల్లిదండ్రులకు అకౌంట్ ఉన్న బ్యాంకులోనే పిల్లల పేరుపై అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని బ్యాంకులు ఈ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ముందస్తు వివరాలు తెలుసుకునే ప్రక్రియలో భాగంగా బ్యాంకులు ఈ రూల్స్ అమలు చేస్తున్నాయి.
ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank) వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఒక ప్రకటన ప్రకారం.. మైనర్ పిల్లల పేరుపై పొదుపు ఖాతా ఓపెన్ చేయాలంటే ఇప్పటికే ఆ బ్యాంకులో వారి తల్లిదండ్రులు సేవింగ్ అకౌంట్ కలిగి ఉండాలి. అదే విధంగా పేరెంట్స్ సైతం బ్యాకింగ్ కేవైసీ నియమాలను పూర్తి చేసి ఉండాలి. అలాగే మైనర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు అవసరమైన అధికారిక గుర్తింపు పొందిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.