తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యవసరంగా రుణం కావాలా? సిబిల్ స్కోర్​ లేకున్నా లోన్​​ పొందండిలా! - how to get pre approved loans

How To Get Personal Loan Without Cibil Score : సాధారణంగా పర్సనల్​ లోన్ తీసుకోవాలంటే సిబిల్​ స్కోర్​ అవసరమవుతుంది. అయితే సిబిల్ స్కోర్​ లేకున్నా, మీరు పర్సనల్​ లోన్ పొందే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Get Personal Loan Without Credit Score
How To Get Personal Loan Without Cibil Score

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 5:36 PM IST

How To Get Personal Loan Without Cibil Score : కష్టసమయాల్లో, డబ్బు అత్యవసరమైన సందర్భాల్లో పర్సనల్ ​లోన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో తక్షణమే పర్సనల్ ​లోన్​ పొందాలంటే సిబిల్​ స్కోర్​ అవసరం అవుతుంది. సాధారణంగా రుణం ఇచ్చే ఏ బ్యాంక్​ అయినా ముందుగా పరిశీలించేది క్రెడిట్​ హిస్టరీనే. గతంలో మీరు తీసుకున్న రుణం వివరాలు, మీ గత చెల్లింపుల చరిత్ర క్రెడిట్​స్కోర్​లో ఉంటాయి. ఒక వేళ మంచి క్రెడిట్​ స్కోర్​ ఉన్నట్లయితే మీకు బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి. కానీ సిబిల్ స్కోర్ లేకున్నా కూడా పర్సనల్​ లోన్ ఎలా​ పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.

ప్రీ-అప్రూవ్డ్​ లోన్స్​
మీకు ఏదైనా బ్యాంకులో సాలరీ అకౌంట్ ఉన్నా, లేదంటే ఏదైనా NBFCలో ఖాతా ఉన్నా, మీకు సులభంగా పర్సనల్​ లోన్ లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, మీ ఆర్థిక లావాదేవీల గురించిన రికార్డులు, వివరాలు వాటి దగ్గర ఉంటాయి. కనుక మీకు సరైన ట్రాక్​ రికార్డ్ ఉంటే, రుణ సంస్థలు ప్రీ-అప్రూవ్డ్​ లోన్స్​ అందిస్తాయి. ఇందుకోసం సాధారణంగా CIBIL స్కోర్ అవసరం ఉండదు. పైగా లోన్​ ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతుంది.

మల్టిపుల్ లెండర్స్​ను సంప్రదించండి!
సంప్రదాయ బ్యాంకులు ఎక్కువగా సిబిల్​ స్కోర్ ఆధారంగానే రుణాలు మంజూరు చేస్తుంటాయి. అయినప్పటికీ నాన్- బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సంస్థలు (NBFC) సహా, ఆన్​లైన్​ బుణదాతలు, ప్రైవేట్ రుణదాతలు ప్రస్తుత కాలంలో కొన్ని నామమాత్రపు షరతులతో రుణాలను మంజూరు చేస్తున్నారు. ఈ సంస్థలు క్రెడిట్ ​స్కోర్​తో సంబంధం లేకుండా సదరు వ్యక్తి ఆదాయం, పనిచేస్తున్న సంస్థ వివరాలు, బ్యాంకింగ్ చెల్లింపుల వివరాలను పరిగణనలోకి తీసుకొని ఇవి రుణాలు ఇస్తాయి.

కో-అప్లికెంట్​ ద్వారా
సిబిల్ స్కోర్ లేకున్నా, పర్సనల్​ లోన్​ పొందేందుకు మరో మార్గం ఉంది. ఎవరైనా మంచి క్రెడిట్ ​స్కోర్​ ఉన్న వ్యక్తితో కలిసి, ఉమ్మడిగా పర్సనల్​ లోన్​కు దరఖాస్తు చేయడం వల్ల మీరు సులభంగా రుణం పొందవచ్చు. ఒక వేళ మీరు తీసుకున్న లోన్​ సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే, మీ తోటి దరఖాస్తుదారుడు చెల్లిస్తారని బ్యాంకులు నమ్ముతాయి.

స్థిరమైన ఆదాయ వనరులు!
క్రెడిట్​ స్కోర్​ లేకున్నా, మీకు స్థిరమైన ఆదాయం వస్తోందని నిరూపిస్తే, ఫైనాన్సియల్​ సంస్థలు మీకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మీ బ్యాంక్ స్టేట్​మెంట్​లు, ఆదాయపన్ను రిటర్నులు, ఆదాయ నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆర్థిక క్రమశిక్షణ - బాధ్యత!
రుణ సంస్థలు ప్రధానంగా మీరు అర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నారా? లేదా? అనే విషయాన్ని చూస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తున్నారా? సమయానికి బిల్లులు చెల్లిస్తున్నారా? తెలివిగా ఖర్చులు చేస్తున్నారా? అనే విషయాలను పరిశీలిస్తాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే మీకు పర్సనల్​లోన్ ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

పర్సనల్​ లోన్​లను కొన్ని బ్యాంకింగేతర సంస్థలు కూడా ఇస్తున్నాయి. ఉదాహరణకు బజాజ్​ ఫైనాన్స్​ లాంటి సంస్థలు ఎలాంటి సిబిల్ స్కోర్​ లేకున్నా పర్సనల్ ​లోన్ అందిస్తాయి. అలాంటి వాటికి మీరు అప్లై చేసుకుని రుణాలు పొందవచ్చు.

క్రెడిట్ స్కోర్​ తగ్గిందా? ఈ సింపుల్​ టిప్స్​తో పెంచుకోండిలా!

మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్​ కార్డ్​తో సింపుల్​గా చెక్​ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details