తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Find Your Which Bank Accounts are linked to Phone Number: మీ ఫోన్​ నంబర్​.. ఏ బ్యాంక్ అకౌంట్​తో లింకైందో తెలుసుకోండిలా..! - మీ ఫోన్ నంబర్​తో ఉన్న ఖాతా తెలుసుకోండిలా

How to Find Bank Accounts linked to Phone Number : మీరు రెండు, మూడు బ్యాంకు అకౌంట్​లు కలిగి ఉన్నారా? వాటికి ఏ ఫోన్ నంబర్ ఇచ్చారో తెలియడం లేదా? చాలా సింపుల్​గా మీ ఫోన్ నంబర్​తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్స్​ తెలుసుకోవచ్చు. మరి, అది ఎలాగో ఇక్కడ చూద్దాం.

Bank Account
How to Find Bank Accounts linked to Phone Number

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 10:20 AM IST

How to Find Your Which Bank Accounts are linked to Phone Number :డిజిటల్ కాలంలో దాదాపుగా అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కొంతమంది వివిధ బ్యాంకులు క్రెడిట్(Credit Cards), డెబిట్ కార్డులపై ఆఫర్స్ ఇస్తుండడంతో రెండు, మూడు ఖాతాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఏ బ్యాంకుకు ఏ ఫోన్ నంబర్ ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. కానీ.. మీ బ్యాంకు అకౌంట్స్(Bank Account) నంబర్స్ తెలిసి ఉండడం అవసరం. ఒకవేళ మీరు మరిచిపోతే.. సింపుల్​గా మీ బ్యాంకు ఖాతాకు లింక్ అయిన నంబర్ ఇలా తెలుసుకోవచ్చు.

UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ ఫోన్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను కనుగొనండిలా..

How to Find Bank Accounts linked to Phone Number use UIDAI Website :సాధారణంగా మీరు బ్యాంకు అకౌంట్ తీసే అన్ని బ్యాంకులు ఆధార్‌ను అడుగుతాయి. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఆధార్​తో మొబైల్ నంబర్ లింక్ చేసి ఉంటారు. కాబట్టి, UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ పేరు లేదా మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను సులభంగా తెలుసుకోవచ్చు.

  • ముందుగా మీరు UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ఆధార్ సేవల కింద Check Aadhaar/Bank Linking Statusను నావిగేట్ చేయండి.
  • అనంతరం ఓపెన్ అయిన పేజీలో మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీని నమోదు చేయాలి.
  • అలాగే క్యాప్చా కోడ్​ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Send OTPపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని అక్కడ నమోదు చేసి.. చివరగా సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • అంతే మీ ఆధార్, ఫోన్​ నంబర్‌కి లింక్ చేయబడిన మొదటి బ్యాంక్ ఖాతా స్క్రీన్​పై డిస్​ప్లే అవుతుంది.

ATM Withdraw Issues : ఏటీఎంలో డబ్బులు రాలేదా..? బ్యాంకులు రోజుకు రూ.100 ఇవ్వాల్సిందే..!

UPI యాప్‌ల ద్వారా ఫోన్ నంబర్‌కి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను కనుగొనండిలా..

How to Find Bank Accounts linked to Phone Number Through UPI Apps :Google Pay, Paytm, PhonePe, BHIM మొదలైన UPI యాప్‌ల ద్వారా మీ పేరు లేదా మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడిన అన్ని బ్యాంక్ ఖాతాలను కనుగొనడానికి మరొక మార్గం. అన్ని యాప్‌లలో అకౌంట్​తో లింక్ అయిన నంబర్ కనుగొనే ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది.

  • మొదట మీ ఫోన్​లో మీరు వాడే UPI యాప్‌ను ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత ఎవరికైనా proceed to pay చేయండి. డబ్బు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.
  • చెల్లింపు స్క్రీన్‌పై ఎంతో కొంత మొత్తాన్ని నమోదు చేయండి. ఉదాహరణకు రూ. 1 అనుకోండి.
  • ఆ తర్వాత చెల్లింపు మోడ్‌ను ఎంచుకోండి.
  • అప్పుడు చెల్లింపు మోడ్ స్క్రీన్‌పై Add a bank accountపై నొక్కండి.
  • ఆ తర్వాత మీరు వ్యక్తిగతంగా బ్యాంక్‌లను ఎంచుకోవాలి.
  • అప్పుడు UPI యాప్​లో మీ ఫోన్ నంబర్​కి ఏ బ్యాంక్ ఖాతా లింక్ చేయబడి ఉందో తెలియజేస్తుంది.

Contact Your Bank to Find Bank Accounts linked to Phone Number :

మీ బ్యాంక్‌ని సంప్రదించడం ద్వారా కూడా ఏ నంబర్ ఇచ్చారో తెలుసుకోవచ్చు..మీ పేరు, నంబర్‌కి లింక్ చేయబడిన ఏవైనా ఇతర ఖాతాల గురించిన వివరాలను పొందడంలోనూ మీ బ్యాంక్ మీకు సహాయం చేస్తుంది. మీకు అకౌంట్​ ఉన్న బ్రాంచ్‌ని సందర్శించడం ఎలా తెలుసుకోవచ్చు అంటే.. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌ బ్యాంక్​లో ఇచ్చి ఉంటారు. మీరు బ్యాంకు వారిని సంప్రదించిం.. మీ ఫోన్ నంబర్ ఏ అకౌంట్​కి లింక్ అయి ఉందో చెప్పాలని కోరితే.. వారు చెక్ చేసి చెబుతారు.

UPI Vs UPI Lite : బేసిక్​ ఫోన్​తో పేమెంట్స్​ చేయాలా?.. UPI & యూపీఐ లైట్​ వాడండిలా!

Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్​ అందించే బ్యాంకులివే..!

How to Link Changed Mobile Number with Aadhaar : మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ మార్చాలా..? అయితే ఈ విధానం ట్రై చేయండి..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details