తెలంగాణ

telangana

ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?.. ఆదాయపు పన్ను శాఖ ఏం చెబుతోంది?

By

Published : Jul 21, 2023, 8:16 AM IST

How Much Cash Should Keep At Home : ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగినా ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లోనే తమ డబ్బులను దాచుకుంటున్నారు. ఇలా ఇంట్లో ఎన్ని డబ్బులైనా దాచుకోవచ్చా? లేదా? అనేది తెలుసుకుందాం.

how-much-cash-can-store-in-house-and-cash-deposit-limit-in-bank
ఇంట్లో ఎన్ని డబ్బులను దాచుకోవచ్చు

How Much Money To Keep At Home : ప్రస్తుతం సాంకేతికత పెరిగిపోవడం వల్ల వివిధ సాధనాల ద్వారా డిజిటల్ లావాదేవీలు సులువుగా చేసుకునే వెసులుబాటు వచ్చింది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా వీటి ద్వారా 24 గంటల్లో ఎప్పుడైనా సరే లక్షల్లో లావాదేవీలు చేసుకోవచ్చు. కేవలం కొన్ని సెకన్లలోనే వేరేవారికి డబ్బులు బదిలీ చేయడం లేదా డబ్బులు స్వీకరించడం లాంటివి చేయవచ్చు. దీంతో ఇండియాలో నగదు లావాదేవీలు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.

ఇంత సాంకేతికత పెరిగినా ఇంకా కొంతమంది పాత పద్దతులనే పాటిస్తున్నారు. ఇంకా డబ్బులను తమ ఇంట్లోనే దాచిపెట్టుకుంటున్నారు. అయితే ఇంట్లో డబ్బులు దాచిపెట్టుకున్నా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసలు ఇంట్లో ఎంతవరకు డబ్బులు దాచుకోవచ్చు..? ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేసినప్పుడు ఎలాంటి పత్రాలు చూపించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలాంటి పరిమితులు లేవు..
Limit Of Keeping Cash At Home : ఇంట్లో ఎంత డబ్బులు నిల్వ ఉంచుకోవచ్చనే దానిపై ఎలాంటి పరిమితులు లేవు. ఆదాయపు పన్ను శాఖ కూడా దీనిపై ఇలాంటి నిబంధనలు ఇప్పటివరకు పెట్టలేదు. దీంతో ఇంట్లో ఎంత డబ్బునైనా దాచుకోవచ్చు. కాకపోతే ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు డబ్బులు ఎలా వచ్చాయనే దానికి ఆధారాలు సమర్పించాలి.

పత్రాలు చూపించకపోతే జరిమానా..
How Much Money To Keep At Home : ఇంట్లో ఉన్న డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై సరైన పత్రాలు సమర్పించకపోతే ఐటీ అధికారులు జరిమానా విధించవచ్చు. మొత్తం డబ్బులో 137 శాతం వరకు జరిమానా వేయవచ్చు. అలాగే పత్రాలు చూపించని డబ్బును స్వాధీనం చేసుకోవచ్చు. దీంతో ఇంట్లో డబ్బులు ఉంచుకుంటున్నయితే ఎలా మీకు ఆదాయం వచ్చిందనే పత్రాలు చూపించాల్సి ఉంటుంది.

ఆర్ధిక సంవత్సరంలో పత్రాలు లేని లేదా లెక్కల్లో లేని రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలకు మాత్రమే జరిమానా విధిస్తారు. అలాగే ఏ వ్యక్తి అయినా రుణం లేదా డిపాజిట్ కోసం రూ.20 వేలకు మంచి నగదును స్వీకరించడానికి అనుమతి లేదు. వ్యక్తికి సంబంధించిన స్థిరమైన ఆస్తి బదిలీకు కూడా ఈ నియమం వర్తిస్తుంది.

రూ.20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే..!
Cash Deposit Limit In Bank : ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను తప్పనిసరిగా అందించాలి. రూ.50 వేల నగదుకు మించి డిపాజిట్ చేసినా లేదా విత్ డ్రా చేసినా సరే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా ఆస్తి అమ్మకం లేదా కొనుగోలు చేయడం ద్వారా రూ.30 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లు అయితే దర్యాప్తు సంస్థల విచారణకు దారి తీయవచ్చు.

డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఒకేసారి రూ.లక్ష విత్ డ్రా చేసినా విచారణ ఉండవచ్చు. ఇక కుటుంబసభ్యుల నుంచి ఒకరోజులో రూ.2 లక్షల నగదును విత్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా బ్యాంకు ద్వారా అంగీకారం ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details