Honda Elevate SUV Launch : స్టన్నింగ్ ఫీచర్స్‌తో.. హోండా ఎలివేట్ లాంఛ్.. ధర ఎంతంటే?
Honda Elevate SUV Launch In Telugu : హోండా మోటార్స్ భారత మార్కెట్లో హోండా ఎలివేట్ పేరుతో మిడ్ సైజ్ ఎస్యూవీ కారును లాంఛ్ చేసింది. అలాగే ఈ కారు డెలివరీ కూడా నేటి నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ హోండా ఎలివేట్ కారు.. స్పెక్స్, ఫీచర్స్, ధర తదితర పూర్తి వివరాలు మీ కోసం..
Honda Elevate SUV Launch : జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ సెప్టెంబర్ 4న ఇండియన్ మార్కెట్లో హోండా ఎలివేట్ ఎస్యూవీ కారును లాంఛ్ చేసింది. ముఖ్యంగా ఈ హోండా ఎలివేట్ కారును నాలుగు వేరియంట్స్‌లో అందుబాటులోకి తెచ్చింది . ఈ ఎలివేట్ కారును.. గ్రాండ్ విటారాకు పోటీగా మార్కెట్లోకి తెచ్చినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
నేటి నుంచే డెలివరీ! Honda Elevate Delivery Date : హోండా ఎలివేట్ కారును సోమవారం (సెప్టెంబర్ 4) నుంచే డెలివరీ చేయనున్నట్లు హోండా మోటార్స్ కంపెనీ స్పష్టం చేసింది.
హోండా ఎలివేట్ - వేరియంట్స్ Honda Elevate Variants :హోండా ఎలివేట్.. SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే వీటన్నింటిలోనూ 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది.
హోండా ఎలివేట్ ఎస్యూవీ వేరియంట్స్
హోండా ఎలివేట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ Honda Elevate Engine Specs :హోండా ఎలివేట్ కారులో 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. వాస్తవానికి దీనిని సిటీ సెడాన్ కారు నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఇంజిన్ 119 bhp పవర్, 145 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అదే విధంగా ఇది 6 స్పీడ్ మాన్యువల్ అండ్ సీవీటీ యూనిట్ అనుసంధానం కలిగి ఉంటుంది. హోండా కంపెనీ ప్రకారం, ఎలివేట్ కారు ఒక లీటర్‌కు 16.92 కి.మీ ఫ్యూయెల్ ఎఫీసియన్సీతో పనిచేస్తుంది.
ఎలివేట్ కారు - ఎక్స్ షోరూమ్ ధరలు Honda Elevate Price :
వేరియంట్
ఎక్స్ షోరూమ్ ధరలు
SV
రూ.11 లక్షలు
V
రూ.12.11 లక్షలు
V CVT
రూ.13.21 లక్షలు
VX
రూ.13.50 లక్షలు
VX CVT
రూ.14.60 లక్షలు
ZX
రూ.14.90 లక్షలు
ZX CVT
రూ.16 లక్షలు
హోండా ఎలివేట్ కారు - ధరలు
వరుసగా 5 కార్లు లాంఛ్ చేస్తాం! Honda Upcoming Cars : జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ ఇండియాలో తన ఎస్యూవీ కార్ల మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు వ్యూహం రచించింది. అందులో భాగంగా 2030లోపు 5 ఎస్యూవీ కార్లను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
స్పోర్ట్స్ యుటిలిసీ కార్స్ Honda Sports Utility Cars : హోండా మోటార్ అనుబంధ సంస్థ అయిన హోండా కార్స్ ఇండియా.. 2030లోపు 5 స్పోర్ట్స్ యుటిలిటీ కార్లను భారత్‌లో లాంఛ్ చేయనున్నట్లు.. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అధికారి తెలిపారు. దీని ద్వారా స్పోర్ట్స్ యుటిలిటీ సెగ్మెంట్లోనూ తమ కంపెనీ బలమైన పోటీదారుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.