Google Layoffs 30000 Employees :ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. AI టెక్నాలజీ వినియోగంలో భాగంగా గూగుల్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులు సులభంగా, వేగంగా పూర్తి చేయొచ్చు. అందుకే పెద్దపెద్ద టెక్ కంపెనీలన్నీ ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. గూగుల్ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి పెట్టింది.
30వేల మందికి గుడ్‌బై!
Is Google Laying Off Employees :ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంలో భాగంగా ఈ టెక్ దిగ్గజం దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సేల్స్ రంగంలో AI వినియోగం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున ఆ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని నిర్ణయించింది. దీంతో సేల్స్ రంగంలో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం పడనుంది.
Google Layoffs 2024 : గూగుల్ ఇప్పటికే యాడ్స్ క్రియేషన్ కోసం PMax ఏఐ ఆధారిత టూల్స్ వినియోగిస్తోంది. ప్రకటనల రూపకల్పన, ప్లేస్‌మెంట్ వంటి విషయాల్లో అడ్వటైజర్లకు సహకరిస్తోంది PMax టూల్. అనేక విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంది. అప్పటికప్పుడు రియల్ టైమ్ యాడ్లలో మార్పులు చేస్తూ ప్రకటనల ప్రభావశీలతను ఈ టెక్నాలజీ పెంచుతోంది.