తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో కొత్త రాన్సమ్​వేర్.. బాధితులు సమాజ సేవ చేయాల్సిందే! - గుడ్​విల్ రాన్సమ్​వేర్

Goodwill ransomware: దేశంలో కొత్త రాన్సమ్​వేర్ బయటపడింది. బాధితులు ఈ రాన్సమ్​వేర్ నుంచి ఉపశమనం పొందాలంటే... సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. నిరాశ్రయులకు కొత్త బట్టలు విరాళాలుగా ఇవ్వడం, పిల్లలకు పిజ్జాలు కొనివ్వడం వంటి పనులు చేసి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Goodwill ransomware
Goodwill ransomware

By

Published : May 23, 2022, 5:18 AM IST

Goodwill ransomware: భారత్‌లో ఓ కొత్త రాన్సమ్‌వేర్‌ను డిజిటల్‌ రిస్క్‌ మానిటరింగ్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ గుర్తించింది. ఈ రాన్సమ్‌వేర్‌ బారిన పడిన బాధితులు.. నిరాశ్రయులైన వారికి కొత్త బట్టలు విరాళంగా ఇవ్వడం, బ్రాండెడ్‌ పిజ్జా విక్రయ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం అందివ్వడం, అత్యవసర వైద్య సాయం అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించడం వంటివి చేయాలని సదరు రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు సూచిస్తున్నట్లు క్లౌడ్‌సెక్‌ తెలిపింది. తమ రీసెర్చర్లు 2022 మార్చిలో గుడ్‌విల్‌ రాన్సమ్‌వేర్‌ను గుర్తించారని, సంప్రదాయ ఆర్థిక కారణాల కంటే సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో ఈ రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు ఆసక్తి చూపుతున్నారనే విషయం పరిశోధనలో తేలిందని క్లౌడ్‌సెక్‌ పేర్కొంది. ఈ రాన్సమ్‌వేర్‌ పత్రాలు, ఫొటోలు, వీడియోలు, డేటాబేస్‌, ఇతర ముఖ్యమైన ఫైల్స్‌ను డీక్రిప్షన్‌ కీ లేకుండా యాక్సెస్‌ చేయలేని స్థితికి మారుస్తోందని తెలిపింది.

బాధితులు ఈ కీ పొందేందుకు నిరాశ్రయులకు కొత్త బట్టలు విరాళాలు ఇవ్వడంతో పాటు దాన్ని రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పిజ్జా కేంద్రాలకు ఐదుగురు పిల్లలకు తగ్గకుండా తీసుకెళ్లి వారికి పిజ్జాలు తినిపించి వాటి ఫొటోలు, వీడియోలు కూడా షేర్‌ చేయాలి. అలాగే వైద్య సాయం అవసరమైన వారికి దగ్గర్లోని ఆసుపత్రుల్లో చికిత్స చేయించి ఆడియో రికార్డు చేసి దాన్ని ఆపరేట్లరకు పంపాల్సి ఉంటుంది. ఈ మూడు పనులు పూర్తి చేసిన బాధితులు 'రాన్సమ్‌వేర్‌ బాధితులైన తర్వాత తాము ఎలా దయ గల మనుషులుగా మారామో' ఫేస్‌బుక్‌ లేదా ఇన్‌స్టాలో రాయాలి. ఇవన్నీ పూర్తి చేస్తే రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు పరిశీలించి డీక్రిప్షన్‌ కిట్‌ను పాస్‌వర్డ్‌ ఫైల్‌తో పాటు వీడియో ట్యుటోరియల్‌తో పంపి ముఖ్యమైన ఫైల్స్‌ను ఎలా రికవరీ చేసుకోవాలో సూచిస్తారని క్లౌడ్‌సెక్‌ వివరించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details