తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Price Today
Gold Price Today

By

Published : Aug 22, 2022, 10:11 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 150 తగ్గి ప్రస్తుతం రూ. 53,200 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.360 తగ్గి ప్రస్తుతం రూ.57,000 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,200గా ఉంది. కిలో వెండి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,200వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,000 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,000 వేల వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,746 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 19.07 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ రూ.13,954 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,08,443 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.17,08,443
ఇథీరియం రూ.1,27,025
టెథర్ రూ.79.92
బినాన్స్​ కాయిన్ రూ.23,681
యూఎస్​డీ కాయిన్ రూ.79.92

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు: దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మిశ్రమ ఫలితాలతో సూచీలు నష్టాలను నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 501 పాయింట్ల నష్టంతో 59,144.87 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 167పాయింట్ల నష్టంతో 17,591 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

లాభనష్టాల్లోనివి: బ్రిటానియా, ఐటీసీ, హెచ్​యూఎల్​, అదానీ పోర్ట్స్, టాటా కాన్స్​ షేర్లు రాణిస్తుండగా.. ఓఎన్​జీసీ, కొటాక్​ మహీంద్ర, అపోలో హాస్పిటల్​, దివిస్​ ల్యాబ్స్, హీరో మోటార్​కార్ప్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 79.80 వద్ద కొనసాగుతోంది.

ఇవీ చదవండి:పదవీ విరమణ ప్రశాంతంగా సాగేలా ఆర్థిక పాఠాలివిగో

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ

ABOUT THE AUTHOR

...view details