తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా..

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

By

Published : Jan 13, 2023, 11:41 AM IST

Updated : Jan 13, 2023, 11:52 AM IST

gold rate today
బంగారం

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగ్గా.. వెండి ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి.. ప్రస్తుతం రూ.57,923 వద్ద ఉంది. కిలో వెండి ధర స్థిరంగా ఉండి.. ప్రస్తుతం రూ. 69,895 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,923 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,895 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,923 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,895 గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,923 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,895 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,923 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,895 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1894.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.67 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,32,054 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.15,32,054
ఇథీరియం రూ.1,14,872
టెథర్​ రూ.81.39
బైనాన్స్​ కాయిన్​ రూ.23,573
యూఎస్​డీ కాయిన్ రూ.81.42

స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 136 పాయింట్ల నష్టంతో 59,821 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 17,831 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.40 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Jan 13, 2023, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details