తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : బంగారం ధర సరికొత్త రికార్డ్.. ఇంకా పెరుగుతుందా? - ఈరోజు విజయవాడ​లో బంగారం వెండి ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం ధర జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Etv gold-rate-today-gold-price-in-hyderabad-and-vijayawada-lifetime-high-gold-price
Etv gold-rate-today-gold-price-in-hyderabad-and-vijayawada-lifetime-high-gold-price

By

Published : Apr 14, 2023, 7:27 PM IST

Updated : Apr 14, 2023, 8:55 PM IST

Gold Rate Today : భారత్​లో బంగారం ధర.. జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. పది గ్రాముల పసిడి ధర భారీగా పెరిగి.. ప్రస్తుతం రూ.62,780గా ఉంది. కిలో వెండి ధర కుడా భారీగా పెరిగింది. ప్రస్తుతం రూ.78,780 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.62,780 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.78,780 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,780 గా ఉంది. కిలో వెండి ధర రూ.78,780 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,780 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.78,780గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,780గా ఉంది. కేజీ వెండి ధర రూ.78,780 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2024.35 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 25.96 డాలర్ల వద్ద ఉంది.

దిల్లీలో బంగారం ధర..
దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.480 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.61,780కు చేరుకుంది. వెండి కూడా కిలో రూ.410 పెరిగి రూ.77,580కి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 2041.35 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 25.88 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల దేశీయంగానూ వాటి ధరలకు రెక్కలొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. డాలర్‌, బాండ్ల సూచీల క్షీణత కారణంగా బంగారం కొనుగోలుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారని, దీంతో ధరలు పెరుగుతున్నట్లు సౌమిల్‌ గాంధీ వెల్లడించారు.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
బిట్​ కాయిన్​ విలువ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.24,91,870 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.24,91,870
ఇథీరియం రూ.1,41,015
టెథర్​ రూ.82.20
బైనాన్స్​ కాయిన్​ రూ.25,429
యూఎస్​డీ కాయిన్ రూ.82.17
Last Updated : Apr 14, 2023, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details