తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : భారీగా తగ్గిన వెండి ధర.. స్వల్పంగా దిగొచ్చిన గోల్డ్​ రేట్ - ప్రొద్దుటూరులో బంగారం ధరలు

Gold Price Today : దేశంలో మళ్లీ బంగారం, వెండి ధర​​లు తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Silver And Fuel Prices Today
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : Aug 3, 2023, 11:57 AM IST

Gold Rate Today : దేశంలో మరోసారి బంగారం, వెండి ధరలు​​ తగ్గాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర మాత్రం భారీగానే క్షీణించింది. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,252గా ఉండగా.. గురువారం రూ.150 తగ్గి రూ.61,102కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.76,150గా ఉండగా.. గురువారం ఏకంగా రూ.1620 తగ్గి రూ.74,530కి చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,102గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,530గా ఉంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,102గా ఉంది. కిలో వెండి ధర రూ.74,530కు చేరుకుంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,102గా ఉంది. కిలో వెండి ధర రూ.74,530గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,102గా ఉంది. కిలో వెండి ధర రూ.74,530కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్​లో కూడా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1960 డాలర్లుగా ఉండగా.. గురువారం ఏకంగా 26 డాలర్లు మేర తగ్గి 1934 డాలర్లకు చేరుకుంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.65 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,05,297 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు బైనాన్స్ కాయిన్​, ఇథీరియం కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెథర్​, యూఎస్​డీ కాయిన్​ మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్​ మార్కెట్​లో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,05,297
ఇథీరియం రూ.1,51,634
టెథర్ రూ. 82.63
బైనాన్స్ కాయిన్ రూ.19,815
యూఎస్​డీ కాయిన్ రూ.82.69

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today : అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో గురువారం ఇండియన్​ స్టాక్​ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్​ను ప్రారంభించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 137 పాయింట్లు కోల్పోయి 65,645 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 35 పాయింట్లు నష్టపోయి 19,491 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, రిలయన్స్​, టాటా మోటార్స్​, ఇన్ఫోసిస్​, ఐటీసీ, పవర్​గ్రిడ్​ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
యాక్సిస్​ బ్యాంక్​, నెస్లే ఇండియా, హెచ్​యూఎల్​, విప్రో, మారుతీ, ఏషియన్​ పెయింట్స్​, కోటక్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, టైటాన్​ స్టాక్​లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 5 పైసలు తగ్గి రూ.82.72 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.92గా ఉంది. డీజిల్​ ధర రూ.97.78గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details