తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : భారీగా పెరుగుతున్న బంగారం​​​ ధరలు.. ఏపీ, తెలంగాణాలో ఎంతంటే? - stock market news in telugu

Gold Price Today : దేశంలో పసిడి ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today
Gold Rate Today

By

Published : Jul 12, 2023, 11:07 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల​ బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.160 పెరిగి బుధవారం రూ.60,740గా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త స్థిరంగా ఉన్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ.20 వృద్ధి చెంది రూ.73,050కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,740గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,050కు చేరుకుంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,740గా ఉంది. కిలో వెండి ధర రూ.73,050గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,740గా ఉంది. కిలో వెండి ధర రూ.73,050కు చేరుకుంది.
  • Gold Price in Proddatur :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,740గా ఉంది. కిలో వెండి ధర రూ.73,050గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు దూసుకుపోతున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1930 డాలర్లుగా ఉండగా, బుధవారం నాటికి సుమారు 9 డాలర్లు వృద్ధి చెంది 1939 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 23.27 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ మంచి ఊపుమీద ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.25,18,451 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్​డీ కాయిన్​​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బైనాన్స్​ కాయిన్​ లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.25,18,451
ఇథీరియం రూ.1,54,789
టెథర్​ రూ.82.27
బైనాన్స్ కాయిన్ రూ.20,514
యూఎస్​డీ కాయిన్ రూ.82.28

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : గత మూడు రోజులుగా దేశీయ స్టాక్​మార్కెట్ల జోరు కొనసాగుతోంది. బుధవారం కూడా దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్​, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడం సహా, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 99 పాయింట్లు లాభపడి 65,716 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 27 పాయింట్లు వృద్ధి చెంది 19,466 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఎన్​టీపీసీ, రిలయన్స్, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, టైటాన్​

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఇన్ఫోసిస్​, టాటా స్టీల్​, టీసీఎస్​, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంకు

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ వృద్ధి చెందుతోంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 16 పైసలు పెరిగి రూ.82.25 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details