తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 20th September 2023 : స్థిరంగా గోల్డ్, సిల్వర్​ రేట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - నేటి బంగారం ధరలు

Gold Rate Today 20th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 20th September 2023
Gold Rate Today 20th September 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 9:29 AM IST

Updated : Sep 20, 2023, 2:43 PM IST

Gold Rate Today 20th September 2023 :దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,239 ఉండగా.. బుధవారం రూ.61,242కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.74,195గా ఉండగా.. బుధవారం రూ.248 తగ్గి రూ.73,947కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 20th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,242గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,947గా ఉంది.
  • Gold Price In Vijayawada 20th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,242గా ఉంది. కిలో వెండి ధర రూ.73,947కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 20th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,242గా ఉంది. కిలో వెండి ధర రూ.73,947గా ఉంది.
  • Gold Price In Proddatur 20th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,242గా ఉంది. కిలో వెండి ధర రూ.73,947కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 20th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1930 డాలర్లుగా ఉండగా.. బుధవారం 1932 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.09 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 20th September 2023 :బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.22,55,726 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.22,55,726
ఇథీరియం రూ.1,36,213
టెథర్ రూ.83.3
బైనాన్స్ కాయిన్ రూ.18,008
యూఎస్​డీ కాయిన్​ రూ.83.21

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు
Stock Market Today 20th September 2023 : బుధవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాలు స్వీకరించడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీయడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 732 పాయింట్లు నష్టపోయి 66,863 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 215 పాయింట్లు కోల్పోయి 19,917 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, యాక్సిస్​ బ్యాంక్​, టాటాస్టీల్​, టాటా మోటార్స్​, టీసీఎస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతి సుజుకి, టైటాన్​, ఐటీసీ

యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ త్వరలో​ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఆసియా మార్కెట్లు అన్నీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 20th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పెరిగి రూ.83.26 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 20th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 20th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.99 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 93.41 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 20, 2023, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details