Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారంతో పోలిస్తే రూ. 500కుపైగా పెరిగింది. ప్రస్తుతం రూ.53,030 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 1300పైగా పెరిగింది. ప్రస్తుతం 64 వేల 380కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,030గా ఉంది. కిలో వెండి ధర రూ.64,380 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,030 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,380గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,030గా ఉంది. కేజీ వెండి ధర రూ. 64,380 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,030గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,380వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 1868 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22.36 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్‌కాయిన్ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ. 24,95,196 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,95,196 |
ఇథీరియం | రూ.1,49,231 |
టెథర్ | రూ.82.11 |
బినాన్స్ కాయిన్ | రూ.25,195 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.16 |