Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.140 ప్రియమైంది. కేజీ వెండి రూ.449 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,340గా ఉంది. కిలో వెండి ధర రూ.68,399 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,340 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,399గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,340గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,399 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,340గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,399 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగానూ బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్సు బంగారం 8 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,930 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.59 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పేట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గురువారం, శుక్రవారం చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది.
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
స్టాక్ మార్కెట్లు:స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 59,028.14 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 17,658 వద్ద ట్రేడవుతోంది. . కీలక వడ్డీ రేట్లను వరుసగా 11వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. పెట్రో మంటతో ద్రవ్యోల్బణం మరింత(4.5శాతం నుంచి 5.7శాతానికి) పెరుగుతుందని, వంట నూనెల ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయని స్పష్టం చేశారు శక్తికాంత దాస్.
ఇదీ చూడండి :'టాటా న్యూ' సూపర్ యాప్ లాంచ్- రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్...