Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం ధరలతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.80 ప్రియమైంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి రూ.110 మేర పడిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,140గా ఉంది. కిలో వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,140 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,430గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,140గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,140గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,430 వద్ద కొనసాగుతోంది.
• స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 3 డాలర్లు అధికంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,932 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.68 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్లు డీలా:గత సెషన్లో భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం డీలా పడ్డాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 246 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 60,365 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం నష్టాల్లోనే ఉంది. 46 పాయింట్లు కోల్పోయి.. 18 వేలకు ఎగువన కదలాడుతోంది. బ్యాంకింగ్, రియాల్టీ సెక్టార్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ట్విన్ షేర్లు పతనమయ్యాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, పవర్ సెక్టార్ షేర్లు రాణిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:మరోవైపు దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 87 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.118.57కు చేరింది. డీజిల్ ధర రూ.104.62కు ఎగబాకింది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.120 దాటింది. తాజాగా పెంచిన 88 పైసలతో.. పెట్రోల్ ధర రూ.120.39కు చేరింది. డీజిల్ ధర రూ.84 పైసలు పెరిగి.. రూ.106.04కు చేరుకుంది. వైజాగ్‌లో 87 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.119.1కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై.. రూ.104.79కు ఎగబాకింది.
ఇదీ చదవండి:ఇంధన ధరల జోరు.. సామాన్యుల బేజారు