తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold rate today
బంగారం ధర

By

Published : Nov 17, 2022, 11:23 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.210 తగ్గి.. ప్రస్తుతం రూ.54,470 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.350 తగ్గి.. రూ.63,000 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.54,470 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,470 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,000గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,470 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.54,470 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,000గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,763.70 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.20 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,44,693 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.13,44,693
ఇథీరియం రూ.98,083
టెథర్​ రూ.81.45
బినాన్స్​ కాయిన్​ రూ.21,930
యూఎస్​డీ కాయిన్ రూ.81.50

స్టాక్​ మార్కెట్లు: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ 113 పాయింట్ల నష్టపోయి.. 61,867 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 18,360 వద్ద కొనసాగుతుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్​టీ, ఐసీఐసీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, పవర్​గ్రిడ్ షేర్లు​ లాభాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్, ఎస్​బీఐఎస్​, యాక్సిస్ బ్యాంక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ: రూపాయి:
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ గురువారం తగ్గింది. ట్రేడింగ్ ప్రారంభంలో 37 పైసలు నష్టపోయి.. ప్రస్తుతం 81.63కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details