UPI without debit card: ఆధార్ ఆధారిత యూపీఐ రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తున్నట్లు గూగుల్ పే ప్రకటించింది. దీని ద్వారా ప్రజలు సులువుగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవడానికి వీలువుతుందని పేర్కొంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లో ప్రజలు తమ ఆధార్ నెంబర్‌తో యూపీఐని రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
UPI registration without Debit card in Google Pay :
గూగుల్‌పే తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో డెబిట్ కార్డ్ లేకున్నా.. యూజర్లు తమ యూపీఐ పిన్ ద్వారా నగదు చెల్లింపులు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇందుకోసం యూజర్లు తమ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాల్సి ఉంటుంది. అలాగే తమ బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానంగా ఉన్న రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌ను.. Google pay లోనూ వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ Google payతో అనుసంధానం కలిగిన బ్యాంకు అకౌంట్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మిగతా బ్యాంకు అకౌంట్ హోల్డర్స్‌కు ఈ ఫీచర్‌ను విస్తరించనున్నారు.
Gpay Aadhaar UPI registration process :
యూపీఐ పిన్ ఎలా క్రియేట్ చేయాలి?
- ప్లేస్టోర్ నుంచి గూగుల్ పే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- యూజర్లు డెబిట్ కార్డ్ వాడాలా? లేదా ఆధార్ వాడాలా? అనేది నిర్ణయించుకోవాలి.
- ఆధార్‌ను ఎంచుకుంటే.. ఆధార్ కార్డ్‌లోని మొదటి ఆరు డిజిట్స్‌ను ఎంటర్ చేయాలి.
- తరువాత ఓటీపీని ఎంటర్ చేసి, ప్రామాణీకరించుకోవాలి.
- అప్పుడు యూజర్‌కు సంబంధించిన బ్యాంకు వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసి, యూపీఐ పిన్ను ఎనేబుల్ చేస్తుంది. దీనితో యాక్టివేషన్ పూర్తి అవుతుంది.
- యూజర్లు తమ ఆన్లైన్ పేమెంట్స్‌ను సులువుగా చేసుకోవడానికి, బ్యాలెన్స్ చూసుకోవడానికి వీలవుతుంది.
ఈ విధంగా యూజర్లు సురక్షితమైన నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గూగుల్ పే మన ఆధార్ నంబర్‌ను స్టోర్ చేయదు. కేవలం ఎన్పీసీఐ వద్దనే మన నంబర్ ఉంటుంది.