తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐ vs ఐసీఐసీఐ vs హెచ్​డీఎఫ్​సీ.. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే.. - సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్​ వడ్డీ రేట్లు

Fixed Deposit Interest Rates In Banks : ఎస్​బీఐ, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లు తమ కస్టమర్​లకు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై అత్యధికంగా 7.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి. సాధారణ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఒకలా.. సీనియర్​ సిటిజన్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై మరోలా వడ్డీని చెల్లిస్తున్నాయి. మరో వైపు వివిధ బ్యాంక్​లు సీనియర్​ సిటిజన్​ల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ వడ్డీ రేట్ల పూర్తి వివరాలను తెలుసుకుందాం.

2023-fixed-deposit-interest-rates-and-senior-citizen-fixed-deposit-interest-rates
2023లో ఫిక్స్‌డ్ డిపాజిట్​లపై వడ్డీ రేట్లు

By

Published : Aug 19, 2023, 8:09 PM IST

Updated : Aug 20, 2023, 6:34 AM IST

Fixed Deposit Interest Rates In Banks :ఫిక్స్​డ్​ డిపాజిట్లపై పలు బ్యాంకులు.. వివిధ రేట్లలో వడ్డీని చెల్లిస్తున్నాయి. డిపాడిట్లపై కాల పరిమితి, వినియోగదారుల వయసు ఆధారంగా 7.50శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు..​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై.. ఏ మేరకు వడ్డీని చెల్లిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Fixed Deposit Interest Rate HDFC : రెండు కోట్ల లోపు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై సంవత్సరానికి హెచ్​డీఎఫ్​సీ చెల్లించే వడ్డీ రేట్లు..

కాల పరిమితి సాధారణ వడ్డీ శాతం సీనియర్​ సిటిజన్లకు
ఏడు రోజుల-14 రోజులకు 3 శాతం 3.50 శాతం
15రోజుల-29 రోజులకు 3 శాతం 3.50 శాతం
30రోజుల-45 రోజులకు 3.50 శాతం 4 శాతం
60రోజుల-89 రోజులకు 4.50 శాతం 5 శాతం
90రోజుల-ఆరు నెలలకు 4.50 శాతం 5 శాతం
6నెలల-9నెలలకు 5.75 శాతం 6.25 శాతం
9నెలల-సంవత్సరం వరకు 6 శాతం 6.50 శాతం
ఏడాది-15నెలల లోపు 6.60 శాతం 7.10 శాతం
15నెలల-18 నెలల లోపు 7.10 శాతం 7.50 శాతం
18నెలల-21నెలల లోపు 7 శాతం 7.50 శాతం
21నెలల-2 ఏళ్ల వరకు 7 శాతం 7.50 శాతం
2ఏళ్ల-2 ఏళ్ల 11నెలల లోపు 7 శాతం 7.50 శాతం
2ఏళ్ల 11నెలల-4 ఏళ్ల 7 నెలలకు 7 శాతం 7.50 శాతం
4ఏళ్ల 7నెలల-5ఏళ్ల లోపు 7 శాతం 7.50 శాతం
4ఏళ్ల-10ఏళ్ల వరకు 7 శాతం 7.50 శాతం

Fixed Deposit Interest Rate SBI : రెండు కోట్ల లోపు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై సంవత్సరానికి ఎస్​బీఐ చెల్లించే వడ్డీ రేట్లు..

కాల పరిమితి సాధారణ వడ్డీ శాతం సీనియర్​ సిటీజన్లకు
7రోజుల-45 రోజులకు 3 శాతం 3.50 శాతం
46 రోజుల -179 రోజులకు 4.50శాతం 5 శాతం
180-210 రోజులకు 5.25 శాతం 5.75 శాతం
211రోజుల-ఏడాదిలోపు 5.75 శాతం 6.25 శాతం
ఏడాది-2ఏళ్ల లోపు 6.80 శాతం 7.30 శాతం
2ఏళ్ల-3 ఏళ్లలోపు 7 శాతం 7.50 శాతం
3ఏళ్ల-5ఏళ్ల లోపు 6.50 శాతం 7 శాతం
5ఏళ్ల-10ఏళ్లకు 6.50 శాతం 7.50 శాతం

Fixed Deposit Interest Rate ICICI : రెండు కోట్ల లోపు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై సంవత్సరానికి ఐసీఐసీఐ చెల్లించే వడ్డీ రేట్లు..

కాల పరిమితి సాధారణ ప్రజలకు సీనియర్​ సిటిజన్లకు
ఏడు-14 రోజులకు 3 శాతం 3.50 శాతం
15-29 రోజులకు 3 శాతం 3.50 శాతం
30-45 రోజులకు 3.50 శాతం 4 శాతం
46-60రోజులకు 4.25 శాతం 4.75 శాతం
61-90 రోజులకు 4.50 శాతం 5 శాతం
91-120 రోజులకు 4.75 శాతం 5.25శాతం
121-150 రోజులకు 4.75 శాతం 5.25 శాతం
151-184 రోజులకు 4.75 శాతం 5.25 శాతం
185-210 రోజులకు 5.75 శాతం 6.25 శాతం
211-270 రోజులకు 5.75 శాతం 6.25 శాతం
271-289 రోజులకు 6 శాతం 6.50 శాతం
290 రోజుల-ఏడాదికి 6 శాతం 6.50 శాతం
15-18నెలల వరకు 7.10 శాతం 7.60 శాతం
18నెలల-2 ఏళ్లకు 7.10 శాతం 7.60 శాతం
2ఏళ్ల-3ఏళ్లకు 7 శాతం 7.50 శాతం
3ఏళ్ల-5ఏళ్లకు 7 శాతం 7.50 శాతం
5ఏళ్ల-10ఏళ్లకు 6.90 శాతం 7.50 శాతం

సీనియర్​ సిటీజన్ల ఫీక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన పలు బ్యాంకులు..
Senior Citizen Fixed Deposit Interest Rates :ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి ఉండే ఫిక్స్​డ్​​ డిపాజిట్లపై సీనియర్​ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేట్లను వివిధ బ్యాంకులు పెంచాయి. యాక్సిస్​ బ్యాంక్ తమ కస్టమర్లకు 3.5% నుంచి 8.05% వరకు వడ్డీని అందిస్తోంది. 2023 ఆగస్టు 14 నుంచే ఈ వడ్డీ రేట్లను పెంచింది.

సీనియర్ సిటిజన్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై.. 4 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను తమ కస్టమర్లకు అందిస్తోంది కెనరా బ్యాంకు. ఫెడరల్​ బ్యాంక్​.. 2023 ఆగస్టు 15 నుంచి సీనియర్​ సిటీజన్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 8.7శాతం వడ్డీని అందిస్తోంది సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. సీనియర్​ సిటీజన్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది.

Ratan Tata Udyog Ratna Award : రతన్​ టాటాకు 'ఉద్యోగ రత్న'.. తొలి అవార్డు ఆయనకే..

Mahindra XUV 700 Recall : మహీంద్రా కస్టమర్లకు అలర్ట్‌.. లక్షకుపైగా కార్లు రీకాల్‌.. ఆ సమస్యే కారణం

Last Updated : Aug 20, 2023, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details