తెలంగాణ

telangana

ETV Bharat / business

First Time Gpay Users? How to Guide : మొదటిసారి గూగుల్​ పే వాడుతున్నారా..? అయితే మీ కోసమే ఇది - గూగుల్​ పే

First Time Gpay Users? How To Use Google Pay Step by Step Guide : జనరేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కొత్తగా ఫోన్ కొనేవాళ్లు వస్తూనే ఉంటారు. మనీ ట్రాన్స్ ఫర్ చేయాల్సిన టైమ్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి కొత్త వాళ్ల జాబితాలో మీరు కూడా ఉన్నారా.. మరి, మీకు గూగుల్ పే గురించిన పూర్తి సమాచారం తెలుసా.. లేదు అంటే మాత్రం ఇది మీకోసం.. స్టెప్ బై స్టెప్ ఇలా నేర్చుకోండి.

How_To _Use_Google_Pay
How_To _Use_Google_Pay

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 12:36 PM IST

First Time Gpay Users? How to Guide: దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ప్రతి పనికీ యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. దీంతో.. చిన్న చిన్నషాపులు మొదలు.. పెద్ద స్థాయిలో నిర్వహించే వ్యాపారాల వరకూ UPI స్కానర్ వైపు వేలు చూపిస్తున్నాయి. అయితే..యూపీఐ యాప్స్ లో.. గూగుల్‌ పే అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ యాప్‌‌లలో ఒకటిగా ఉంది. రైలు, విమాన టిక్కెట్‌ల బుకింగ్​ మొదలు.. కూరగాయలు కొనడం వరకూ ఈ యాప్ వినియోగిస్తున్నారు. అయితే.. కొత్త వారికి ఈ యాప్ ఎలా వాడాలో అవగాహన ఉండకపోవచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇక్కడ చూద్దాం.

  • ముందుగా మీ ఫోన్​లో Google Playstoreకి వెళ్లి, సెర్చ్​ బార్​లో 'Google Pay' అని టైప్ చేయండి.
  • 'Install' ఆప్షన్​పై క్లిక్ చేయండి. యాప్​ ఇన్​స్టాల్​ అయిన తర్వాత.. ఓపెన్​ చేయండి.
  • యాప్​ ఓపెన్​ చేసిన తర్వాత.. Enter Your Phone Number అనే బాక్స్​లో మీ ఫోన్​ నెంబర్​ ఎంటర్​ చేసి..Continue ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత గూగుల్​ పే కు సంబంధించిన టర్మ్స్​ అండ్​ కండీషన్స్​ స్క్రీన్​ మీద కనిపిస్తాయి. ఆ తర్వాత Accept and Continue ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • ఇప్పుడు మీ ఫోన్​ నెంబర్​కు OTP​ వస్తుంది. దానిని ఎంటర్​ చేసిన తర్వాత.. గూగుల్​ పే హోమ్​ పేజీ ఓపెన్​ అవుతుంది.
  • తర్వాత మీ ఫ్రొపైల్​ ఐకాన్​పై క్లిక్​ చేసి.. Payments Methods లో బ్యాంక్​ అకౌంట్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్​ కలిగి ఉన్నారో.. సెర్చ్​ బార్​లోకి వెళ్లి దానిని సెర్చ్​ చేసి, సెలెక్ట్​ చేసుకోవాలి.
  • తర్వాత మీ డెబిట్​ కార్డ్​ వివరాలు ఎంటర్​ చేసి.. ఆ తర్వాత మీ యూపీఐ పిన్ సెట్​ చేసుకోవాలి.
  • మీ గూగుల్​ పే ఖాతాకు బ్యాంకు అకౌంట్​ యాడ్​ అవుతుంది.
  • తర్వాత హోమ్​ పేజీలోకి వెళ్తే.. అందులో QR Code Scan, Pay contacts, Pay Phone number, Bank Transfer, Pay to UPI ID, Self Transfer, Pay Bills, Mobile Recharge ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు ఎవరికైనా డబ్బులు పంపాలనుకుంటే.. Pay Contacts ఆప్షన్​పై క్లిక్​ చేసి.. సెర్చ్​ బార్​లో వారి పేరు లేదా నెంబర్​ను ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత Pay అనే ఆప్షన్​పై క్లిక్​ చేసి ఎంత డబ్బు పంపాలనుకుంటున్నారో ఎంటర్​ చేయండి
  • ఇప్పుడు మీరు అంతకుముందే సెట్​ చేసుకున్న యూపీఐ పిన్ ఎంటర్​ చేస్తే.. మనీ సెండ్​ అవుతుంది.
  • Google Payలో రివార్డ్స్ (Rewards in Google pay) కూడా వస్తాయి.
  • మనం ఎవరికైనా డబ్బులను బదిలీ చేసినప్పుడు.. స్క్రాచ్ కార్డ్‌లు వస్తాయి.
  • వాటిని స్క్రాచ్ చేస్తే.. మీకు ఎలాంటి రివార్డ్స్ వచ్చాయో అక్కడ కనిపిస్తుంది.

How to be Safe from UPI Frauds: యూపీఐ మోసం.. తేడావస్తే అంతే.. ఇలా రక్షించుకోండి!

ABOUT THE AUTHOR

...view details