తెలంగాణ

telangana

ETV Bharat / business

డిసెంబర్ డెడ్​లైన్స్​ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్​ చేయాల్సిందే! - sbi amrit kalash fd scheme last date

Financial Deadlines In December 2023 In Telugu : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు, పలు ఫైనాన్సియల్​ డెడ్​లైన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్​ 31తో డీమ్యాట్​ నామినేషన్​, ఐటీఆర్​ దాఖలు, బ్యాంక్​ లాకర్ అగ్రిమెంట్, ఫ్రీ ఆధార్​ అప్​డేషన్​ సహా పలు ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. ఈ గడువులోగా ఈ పనులు పూర్తి చేసుకోకుంటే, తరువాత ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందుకే వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

financial changes effect from January 1st 2023
Financial Deadlines In December 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 12:49 PM IST

Financial Deadlines In December 2023 :మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టనున్నాం. అంతకంటే ముందు ఈ డిసెంబర్​ నెలాఖరులోగా పలు కీలక ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. వాటిని సకాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే అత్యంత ప్రధానమైన ఫైనాన్సియల్ డెడ్​లైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2023 December 31st Financial Deadlines :

  1. మ్యూచువల్ ఫండ్​, డీమ్యాట్​ నామినేషన్​ : డీమ్యాట్​, మ్యూచువల్ ఫండ్​ యూనిట్​ హోల్డర్లు కచ్చితంగా తమ ఖాతాలకు నామినీలను జత చేసుకోవాలి. ఇందుకోసం సెబీ 3 నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు డిసెంబర్​ 31తో తీరిపోతుంది. ఒక వేళ ఈ చివరి తేదీలోపు ఎవరైనా తమ డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్​లకు నామినీలను ఏర్పాటుచేసుకోకపోతే, వారి ఖాతాలను స్తంభింపజేస్తారు.
  2. ఇన్​యాక్టివ్​ యూపీఐ ఐడీస్​ : నేషనల్ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (NPCI) ఒక సంవత్సరంపాటు ఇన్​యాక్టివ్​గా ఉన్న యూపీఐ ఐడీలను, నంబర్​ను డీయాక్టివేట్ చేయాలని పేటీఎం, గూగుల్​ పే, ఫోన్​ పే లాంటి పేమెంట్​ యాప్​లను ఆదేశించింది. థర్డ్​ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్​ సర్వీస్​ ప్రొవైడర్లు దీన్ని అమలు చేసేందుకు డిసెంబర్​ 31 వరకు గడువు విధించింది. కనుక యూజర్లు ఈ గడువులోపు తమ యూపీఐ ఐడీ ద్వారా పేమెంట్స్​ చేసి, వాటిని యాక్టివ్​గా ఉంచుకోవడం మంచిది.​
  3. బ్యాంక్ లాకర్​ అగ్రిమెంట్ డెడ్​లైన్​ : రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సవరించిన బ్యాంక్ లాకర్ ఒప్పందాలను దశలవారీగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందుకు 2023 డిసెంబర్​ 31ని చివరి గడువుగా నిర్ణయించింది. కనుక ఎవరైతే 2022 డిసెంబర్​ 31 లేదా అంతకు ముందు బ్యాంక్​ లాకర్​ తీసుకున్నారో, వారు కచ్చితంగా లేటెస్ట్ అగ్రిమెంట్​పై సంతకం చేసి, దానిని డిసెంబర్​ 31లోపు సమర్పించాల్సి ఉంటుంది.
  4. ఆదాయపన్ను రిటర్నులు​ : 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరు తేది డిసెంబర్​ 31. అందువల్ల ఈ గడువులోగా ఇన్​కం టాక్స్​ రిటర్నులు దాఖలు చేయడం మంచిది. వాస్తవానికి జులై 31తోనే ఐటీఆర్​ ఫైలింగ్ చివరి తేదీ ముగిసింది. ఇప్పుడు ఐటీఆర్ ఫైల్​ చేయాలంటే, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రూ.1000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.5,000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  5. ఆధార్ అప్​డేట్​కు చివరి తేదీ : చాలా ఏళ్లుగా ఎవరైతే తమ ఆధార్​ వివరాలను అప్​డేట్ చేసుకోలేదో, వారు డిసెంబర్​ 31 లోపు ఉచితంగా అప్​డేట్​ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఆధార్​ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది తప్పనిసరి. ఒక వేళ ఈ గడువులోగా ఆధార్​ అప్​డేట్ చేసుకోకపోతే, తరువాత నుంచి ఆధార్​ అప్​డేట్​ కోసం రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  6. పేపర్​ బేస్డ్​ కేవైసీకి ఫుల్​స్టాప్​ : ఇకపై కొత్త సిమ్​కార్డ్​ తీసుకునేటప్పుడు ఈ-కేవైసీ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. టెలికమ్యునికేషన్ డిపార్ట్​మెంట్ నిర్దేశాల ప్రకారం, 2024 జనవరి 1 నుంచి పేపర్ బేస్డ్ కేవైసీ ప్రాసెస్​ పూర్తిగా నిలిచిపోనుంది.
  7. ఎస్​బీఐ అమృత్ కలశ్​​ : భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ 'అమృత్​ కలశ్​ స్పెషల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్​ స్కీమ్'​ గడువును డిసెంబర్​ 31 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్​ స్కీమ్​లో 7.10 శాతానికి పైగా వడ్డీ రేటు అందిస్తారు. కనుక ఆశావహులు డిసెంబర్​ 31లోపు ఈ స్కీమ్​లో చేరాల్సి ఉంటుంది.
  8. ఎస్​బీఐ హోమ్ లోన్ ఆఫర్​ : స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా ప్రస్తుతం గృహ రుణాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్​ 31లోపు ఎవరైతే హోమ్ లోన్​ తీసుకుంటారో వారికి 65 బేసిస్ పాయింట్లు వరకు రాయితీ అందిస్తుంది. ఈ ప్రత్యేక రాయితీ వివిధ రకాల గృహ రుణాలకు వర్తిస్తుంది. కనుక ఆశావహులు ఎవరైనా ఉంటే, వారు ఈ 2023 డిసెంబర్ 31లోపు ఎస్​బీఐ హోమ్​లోన్ కోసం అప్లై చేసుకోవడం మంచిది.
  9. ఐడీబీఐ స్పెషల్ ఎఫ్​డీ : ఐడీబీఐ బ్యాంక్ రూ.2 కోట్లలోపు ఫిక్స్​డ్​ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. అలాగే అమృత్ మహోత్సవ్ అనే ప్రత్యేక ఫిక్స్​డ్​ డిపాజిట్​ కాలవ్యవధిని 375 రోజులు నుంచి 444 రోజులకు పొడిగించింది. ఈ స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్లలో చేరడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 31.
  10. ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్​డీ : ఇండియన్ బ్యాంక్​ 'ఇండ్​ సూపర్​ 400', 'ఇండ్​ సుప్రీం 300' అనే రెండు స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​ల గడువును డిసెంబర్​ 31 వరకు పొడిగించింది. కనుక ఆసక్తి ఉన్నవారు ఈ డిసెంబర్​ నెలాఖరులోగా ఈ స్కీమ్​ల్లో చేరాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details