EPFO Interest 2022-23 : దీపావళి సందర్భంగా.. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO).. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ వడ్డీ (PF Interest)ని ఖాతాదారుల అకౌంట్లలో జమచేస్తోంది. కొందరి ఖాతాల్లో ఇప్పటికే వడ్డీ సొమ్ము జమ అయ్యింది. ఇంకా.. పలువురి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ.. పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీని కింద ప్రతినెలా మీ జీతం నుంచి 12 శాతం వరకు పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. మీరు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం కూడా.. అంతే మొత్తంలో సొమ్మును మీ పీఎఫ్ అకౌంట్‌కు జమ చేస్తుంది. ఇలా జమచేసిన డబ్బులపై EPFO ప్రతి ఏటా వడ్డీ చెల్లిస్తుంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని.. ఇప్పుడు జమ చేయడం ప్రారంభించింది. వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరి, ఇంకెందుకు ఆలస్యం? మీకు ఈపీఎఫ్ఓలో ఖాతా ఉంటే.. ఇప్పుడే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈపీఎఫ్‌ఓ అధికారిక ఫోర్టల్ ద్వారా, ఉమంగ్ యాప్ ద్వారా, టెక్ట్స్ మెసేజ్ ద్వారా, అదేవిధంగా మిస్డ్ కాల్ అలర్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
EPFO వెబ్‌సైట్ ద్వారా :మీ పీఎఫ్ అకౌంట్లో ఈపీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి.. ముందు మీరు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లోని సర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘For Employees’ సెక్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత అందులో మెంబర్ పాస్‌బుక్‌ను ఎంచుకోవాలి. ఆపై లాగిన్ పేజీలో యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వడం ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు.