తెలంగాణ

telangana

ETV Bharat / business

Electric Scooters Offers October 2023 : దసరాకు స్కూటర్​ కొనాలా?.. ఆ ఎలక్ట్రిక్ వెహికల్​పై ఏకంగా రూ.40,000 వరకు డిస్కౌంట్​! - Ather Energy Scooter Festival Offers 2023

Electric Scooters Discounts October 2023 : ఈ పండగ సీజన్​లో తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్​లు ప్రకటించాయి ఓలా, ఏథర్ ఎనర్జీ, ఐవోమీ కంపెనీలు. కొన్ని కంపెనీలు తాము తయారు చేసిన ఈవీ స్కూటీలపై ఏకంగా రూ.40,000 వరకు డిస్కౌంట్​ ఇస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Electric Scooty Discounts October 2023 :
Electric Scooters Discounts October 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 3:17 PM IST

Electric Scooters Discounts October 2023 :పండగల వేళ చాలా మంది కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కంపెనీలు కూడా అదే స్థాయిలో తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందించి.. పండగల సమయంలోనే తమ అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఓలా, ఏథర్ ఎనర్జీ, ఐవోమీ లాంటి ప్రముఖ ఎలక్ట్రిక్​​ టూవీలర్​ వెహికల్​ కంపెనీలు కూడా.. ఈ పండగ సీజన్​లో తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్​లు ప్రకటించాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటీ..
Ola Electric Scooter Festival Offers 2023 : తమ అన్ని స్కూటీ మోడళ్లపై రూ.24,500 వరకు తగ్గింపులు అందిస్తోంది ఓలా కంపెనీ. ప్రస్తుతం ఓలాలో S1X, S1 Air, S1 Pro లాంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ కింద మరో రూ.10వేల వరకు డిస్కౌంట్​ అందిస్తోంది ఓలా. కొన్ని క్రెడిట్​ కార్డ్​లపై ఇచ్చే ఈఎమ్​ఐ సదుపాయం కూడా కల్పిస్తోంది. దాంతో పాటు క్యాష్​బ్యాక్​లు, ఇతర ఆఫర్లను సైతం ఇస్తోంది ఓలా కంపెనీ.

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటీలు
ఓలా ఎలక్ట్రిక్​ స్కూటీలు

ఏథర్ ఎనర్జీ..
Ather Energy Scooter Festival Offers 2023 :ఏథర్​ ఎనర్జీ కంపెనీ కూడా తమ ఉత్పత్తులపై భారీగానే ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ ప్రస్తుతం 450S, 450X 2.9kWh, 450X 3.7kWh స్కూటీలపై మంచి ఆఫర్స్ అందిస్తోంది. 450S స్కూటీపై పండగ ఆఫర్​ కింద రూ.5వేల వరకు తగ్గింపును అందిస్తోంది ఏథర్ ఎనర్జీ. దాంతోపాటు కార్పొరేట్​ ఆఫర్​ కింద రూ.1500 వరకు డిస్కౌంట్​ను ఇస్తోంది. ఎక్స్ఛేంజ్​ బోనస్​ కింద రూ.40వేల వరకు తగ్గింపు లభిస్తోంది. మొత్తంగా 450S మోడల్​ స్కూటీ రూ.86,050కు (ఎక్స్​-షోరూం ధర) అందుబాటులో ఉంది.

450X 2.9 kWh స్కూటీ మోడల్​పై రూ.1,500 కార్పొరేట్​ డిస్కౌంట్​ను అందిస్తోంది కంపెనీ. అదే విధంగా రూ.40వేల వరకు ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ను ఇస్తోంది. మొత్తంగా ఈ స్కూటీ ధర రూ.1,01,249 (ఎక్స్​ షోరూం)గా ఉంది. 450X 3.7 kWh, 450X 2.9 kWh మోడల్​ స్కూటీలు కూడా దాదాపు ఇవే ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

ఏథర్ ఎనర్జీ స్కూటీ
ఏథర్ ఎనర్జీ స్కూటీ

ఐవోమి..
iVOOMi Scooter Festival Offers 2023 :ఐవోమ్​ ఎనర్జీ కంపెనీ కూడా JeetX, Jeet S1 మోడల్​ స్కూటీలపై భారీగానే డిస్కౌంట్​లను అందిస్తోంది. ప్రస్తుతం JeetX ధర రూ.99,999లుగాను, Jeet S1 స్కూట ధర రూ.84,999గా ఉంది. కానీ పండుగ వేళ JeetX స్కూటీ రూ. 91,999కే లభిస్తోంది. అదేవిధంగా Jeet S1 రూ.81,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా బైక్​ యాక్సెసరీస్​పై రూ.10వేల వరకు డిస్కౌంట్​ ఇస్తోంది ఐవోమి​. ​దాంతోపాటు ఆర్​టీఓ ఛార్జెస్​ను​ కూడా ఐవోమీ కవర్​ చేస్తుంది.

iVOOMi స్కూటీ

Hyundai Car Discounts In October 2023 : దసరాకు కొత్త కారు కొనాలా?.. హ్యుందాయ్​ మోడల్స్​పై భారీ డిస్కౌంట్స్​​​.. ఆ కారుపై ఏకంగా రూ.50వేలు బెనిఫిట్​!

Ola Bharat EV Fest Offers : ఓలా ఫెస్టివ్ ఆఫర్స్​​.. ఆ ఈవీ స్కూటర్​పై ఏకంగా 50% డిస్కౌంట్​!

ABOUT THE AUTHOR

...view details