EV insurance India: మనలో చాలా మందికి కొత్త బైక్ కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది. అందుకోసం చాలా ఖర్చు పెట్టి కలల బైక్‌ను సొంతం చేసుకుంటాం. కానీ దానికి సరైన ఇన్సూరెన్స్ చేసే విషయంలో మాత్రం అలసత్వం చూపిస్తాం. ఇది సరికాదు. సాధారణంగా పెట్రోల్ బైక్‌కు అయినా, ఎలక్ట్రకిల్ టూ వీలర్‌కు అయినా ఇన్సూరెన్స్ తీసుకునే విధానం ఒకలానే ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం కోసం తీసుకునే బీమా పాలసీ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
e two wheeler insurance add-ons :
మీరు కొత్తగా ఎలక్ట్రికల్ టూవీలర్ తీసుకున్నట్లయితే కచ్చితంగా 5 సంవత్సరాల కాలపరిమితిగల థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను తీసుకోండి. దీనితో పాటు మరికొన్ని యాడ్-ఆన్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే
- జీరో డిప్రిసియేషన్ కవర్
- రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
కొన్ని బీమా సంస్థలు బ్యాటరీ రక్షణ కోసం కవరేజీని కూడా కల్పిస్తాయి. మీకు అవకాశం ఉంటే దానిని కూడా తీసుకోండి. పొరపాటున బ్యాటరీలోకి నీళ్లు చేరి, అది పాడైపోయినప్పుడు ఈ యాడ్-ఆన్ మీకు పరిహారం లభించేలా చూస్తుంది. ప్రస్తుతం చాలా బీమా సంస్థలు పోటీపడి మరీ ఎలక్ట్రికల్ వాహనాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాయి. కనుక మీరు మీ బైక్‌కు బీమా చేయాలనుకున్నప్పుడు మంచి బీమా కవరేజ్ ఉన్న పాలసీని తీసుకోవడం ఉత్తమం.
ద్విచక్ర వాహనం కోసం బీమా పాలసీని తీసుకునేటప్పుడు ఆ పాలసీ కవర్ వేటికి వర్తిస్తుందో పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా థర్ట్‌పార్టీ పాలసీలు, కాంప్రహెన్సివ్ పాలసీలను సమగ్రంగా పరిశీలించి, మీకు అనువైనది తీసుకోవాలి. మన దేశంలోని రద్దీ రోడ్లపై వాహనాలు నడపాలంటే, కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకొనితీరాలి. అదే మీకు ఆపద వేళ రక్షణ కల్పిస్తుంది. ఒక వేళ బీమా చేయకుండా బండి నడిపితే, అది చట్ట విరుద్ధమైన పని అవుతుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేసింది. థర్ట్ పార్టీ పాలసీ కేవలం అవతల వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. కాంప్రహెన్సివ్ పాలసీ మీ బైక్‌కు వర్తిస్తుంది. ఈ కాంప్రహెన్సివ్ పాలసీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో సరైనది ఎంచుకోవాలి.
టూ వీలర్ పాలసీ వల్ల కలిగే లాభాలు :
Benefits of two wheeler Insurance policy
1. ప్రమాదవశాస్తు యాక్సిడెంట్ జరిగినప్పుడు, బైక్ రిపేర్‌కు అయ్యే ఖర్చు బీమా సంస్థ భరిస్తుంది.
2. ప్రమాదం జరిగినప్పుడు అవతల వ్యక్తి గాయపడే అవకాశం ఉంది. అప్పుడు కూడా బీమా పాలసీ కొంత వరకు నష్టాన్ని పూరిస్తుంది.