తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలా? కచ్చితంగా ఇవి తెలుసుకోండి! - credit bureau cibil score

Credit Scores : ఆధునిక జీవితంలో క్రెడిట్​ స్కోర్​ ఒక భాగమైపోయింది. బ్యాంకు రుణం పొందాలంటే కచ్చితంగా క్రెడిట్​ స్కోర్​ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రెడిట్​ స్కోర్​ 750 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. లేదంటే రుణాలపై అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. మరి మంచి హై క్రెడిట్​ స్కోర్​ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

what is credit score and  how to get loans with credit score
Credit Scores

By

Published : Jun 21, 2023, 5:34 PM IST

Credit Scores : క్రెడిట్​ స్కోర్ 750కు పైగా ఉండడం మంచిది అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎక్కువ శాతం ప్రభుత్వ బ్యాంకులు సిబిల్​ స్కోర్​ 800కు పైగా ఉంటే.. కేవలం 8.50 శాతం వడ్డీకే గృహ రుణాలు మంజూరు చేస్తుంటారు. క్రెడిట్​ స్కోర్​ లేని వారికి 8.80 శాతం వడ్డీతో రుణాలు ఇస్తుంటాయి. కానీ క్రెడిట్ స్కోర్​ 550 నుంచి 649 మధ్య ఉన్నవారికి మాత్రం 9.65 శాతం వడ్డీ అంటే.. అధిక వడ్డీకి రుణాలు ఇస్తాయి. దీనికి కారణమేమిటో మీకు తెలుసా?

సిబిల్​ ఎలా ప్రారంభమైంది?
How CIBIL was started : 1999లో ఆర్​బీఐకి చెందిన ఎన్​హెచ్​ సిద్దిఖీ కమిటీ భారత దేశంలో క్రెడిట్​ బ్యూరోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిజాయితీతో, నిబద్ధతతో ఉండే వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చూడాలని, అలాగే డిఫాల్టర్లకు ఇలాంటి రుణాలు అందకుండా చేయాలంటే తప్పక క్రెడిట్​ బ్యూరోలు ఉండాలని సిద్దిఖీ కమిటీ అభిప్రాయపడింది. ఫలితంగానే 2000వ సంవత్సరంలో సిబిల్​ ఏర్పడింది. భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. వాటిలో సిబిల్​ ఒకటి. 2000వ సంవత్సరం నుంచి సిబిల్​ వ్యక్తులకు సంబంధించిన క్రెడిట్ స్కోర్​లను అందిస్తూ వస్తోంది.

క్రెడిట్​ స్కోర్​ జీవితంలో ఒక భాగం
జీవితంలో క్రెడిట్​ స్కోర్​ ఒక భాగం అయిపోయింది. ఇవి వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్​.. వారి క్రెడిట్​ కార్డ్​, హోమ్​ లోన్​, కారు లోన్ దరఖాస్తులు ఎలా ప్రాసెస్​ కావాలో నిర్ణయిస్తుంది.

సాధారణంగా క్రెడిట్​ స్కోర్ రేంజ్​​ 300 నుంచి 900 పాయింట్లు వరకు ఉంటుంది. ప్రతి క్రెడిట్​ బ్యూరో తనదైన పద్ధతిలో క్రెడిట్ స్కోర్​లను ఇస్తుంది. క్రెడిట్​ స్కోర్​ 900 ఉందంటే.. అది సూపర్​ స్కోర్​ అని అర్థం. స్కోర్​ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ఆర్థిక పరపతి ఉందని అర్థం.

ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న సమయంలో క్రెడిట్​ స్కోర్​ మంచి అండగా నిలుస్తుంది. ఇళ్లు కొనాలని అనుకున్నా లేదా కారు కొనాలని అనుకున్నా కూడా మంచి క్రెడిట్​ స్కోర్​ ఉంటే చాలా సులభంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి వీలవుతుంది.

విదేశాలకు వెళ్లి పెద్ద చదువులు చదవాలన్నా, పెళ్లి లాంటి శుభకార్యాలు జరిగినప్పుడు, అనుకోకుండా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మంచి క్రెడిట్​ స్కోర్​ మనల్ని ఆదుకుంటుంది. మంచి క్రెడిట్​ స్కోర్​ ఉందంటే మీకు సకాలంలో వాయిదాలు చెల్లించే సామర్థ్యం ఉందని అర్థం. అందుకే బ్యాంకులు మీకు సులువుగా రుణాలు మంజూరు చేస్తాయి. ఒక వేళ మీ క్రెడిట్​ స్కోర్​ తక్కువ ఉందంటే.. మీరు ఆర్థిక స్థిరత్వంలేని వారు అని అర్థం. అందుకే ఇలాంటి వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం కష్టం.

మంచి క్రెడిట్​ స్కోర్​ అంటే ఎంత ఉండాలి?
Best credit score : క్రెడిట్​ స్కోర్​ 750 కంటే ఎక్కువ ఉంటే మంచిది. కానీ భారతదేశంలో సగటు వ్యక్తుల క్రెడిట్​ స్కోర్​ 700 మాత్రమే ఉంటోంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే తక్కువ క్రెడిట్​ స్కోర్ ఉంటే బ్యాంకులు సాధారణంగా రుణాలు మంజూరు చేయవు. ఒక వేళ రుణాలు ఇచ్చినా అధిక వడ్డీలను వసూలు చేస్తాయి.

అసలు ఎవరికి క్రెడిట్​ స్కోర్​ ఉంటుంది?
క్రెడిట్​ హిస్టరీ ఉన్నవారికి మాత్రమే క్రెడిట్ స్కోర్ ఉంటుంది. స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న రుణాలను క్రెడిట్ స్కోర్​ కింద పరిగణించరు. బ్యాంకు లేదా ఎన్​బీఎఫ్​సీ నుంచి లోన్​ లేదా క్రెడిట్​ కార్డ్​ తీసుకున్న నాటి నుంచి మీ క్రెడిట్​ స్కోర్​ లెక్కించడం ప్రారంభమవుతుంది.

క్రెడిట్​ హిస్టరీ లేని సమయంలో మీ స్కోర్​ ఎంత ఉంటుంది?
మీరు అధికారికంగా ఎలాంటి క్రెడిట్​ తీసుకోకపోతే.. మీ స్కోర్​ (-1) మైనస్​ ఒకటిగా ఉంటుంది. అంటే ఇది మీకు ఎలాంటి క్రెడిట్​ హిస్టరీ లేదని స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక వేళ మీ క్రెడిట్​ స్కోర్​ '0' (సున్నా) గా ఉందంటే.. మీరు రుణం తీసుకుని ఆరు మాసాలు దాటలేదని అర్థం. వాస్తవానికి దీని వల్ల మీకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఎందుకంటే మీరు రుణం తీసుకుని చాలా తక్కువ కాలం మాత్రమే అయ్యింది కనుక. మీరు రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తూ ఉంటే, కచ్చితంగా మీ క్రెడిట్​ స్కోర్ బాగా వృద్ధి చెందుతుంది. ఒక వేళ సకాలంలో చెల్లించకపోతే మీ క్రెడిట్​ స్కోర్​ పడిపోతుంది.

ఉదాహరణకు చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు సిబిల్ స్కోర్​ 800 కంటే ఎక్కువ ఉన్నవారికి 8.50 శాతం వడ్డీకే గృహ రుణాలు ఇస్తాయి. ఏమాత్రం క్రెడిట్​ స్కోర్​ లేని వారికి 8.80 వడ్డీ రేటుకు హోమ్​ లోన్స్ ఇస్తాయి. కానీ క్రెడిట్​ స్కోర్​ 649 నుంచి 550 మధ్యలో ఉన్నవారికి మాత్రం గృహ రుణాలపై 9.65 శాతం వడ్డీని విధిస్తాయి. 550 కంటే తక్కువ ఉన్నవారి రుణాలు మంజూరు చేయవు.

మీ క్రెడిట్​ స్కోర్​ను ఎలా లెక్కిస్తారు?
How your credit score is compiled :మీరు బ్యాంకు నుంచి రుణం పొందిన వెంటనే, సదరు బ్యాంకు సంబంధిత రుణ వివరాలను.. సిబిల్​, ఎక్స్​పీరియన్​ లాంటి క్రెడిట్ బ్యూరోలకు అందిస్తాయి. వివిధ బ్యూరోలు తమదైన పద్ధతిలో, తమదైన కొలమానాలను ఉపయోగించి క్రెడిట్​ స్కోర్​ను లెక్కిస్తాయి. ముఖ్యంగా మీరు ఎప్పుడు, ఏ బ్యాంకు నుంచి, ఎంత మేరకు రుణం తీసుకున్నారు. మీరు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారా? తదితర అన్ని అంశాలను క్రెడిట్​ బ్యూరోలు పరిశీలిస్తాయి. వీటి ఆధారంగా మీకు క్రెడిట్​ స్కోర్​ను ఇస్తాయి.

మీ క్రెడిట్​ స్కోర్​పై ప్రభావం చూపించే అంశాలు ఏమిటి?
What impacts your Credit score : క్రెడిట్​ స్కోర్​ 800 సాధించడం పెద్ద విషయమేమీ కాదు. ఇందు కోసం మీరు కచ్చితంగా సకాలంలో మీ క్రెడిట్​ కార్డ్​ బిల్లులు, రుణ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడూ మీ క్రెడిట్​ కార్డుకు ఉన్న​ పరిమితి కంటే తక్కువ మొత్తాన్నే ఉపయోగించుకోవాలి. ఒకే సారి చాలా రుణాల కోసం ప్రయత్నించకూడదు. మీ క్రెడిట్ స్కోర్​ దీర్ఘకాలంపాటు స్థిరంగా ఉండేలా చూసుకోవడం. ఇవన్నీ మీ క్రెడిట్​ స్కోర్ పెరగడానికి ఉపయోగపడతాయి.

మీ క్రెడిట్​ స్కోర్​ను తెలుసుకోవడం ఎలా?
Credit Score free check online : ఆర్​బీఐ ఆదేశాల ప్రకారం, ప్రతి క్రెడిట్​ బ్యూరో సంస్థ సంవత్సరానికి ఒకసారి తమ కస్టమర్లకు ఉచితంగా బేసిక్​ క్రెడిట్​ రిపోర్టును ఇవ్వాలి. దీనితో పాటు క్రెడిట్​ బ్యూరోలు నిర్దేశించిన రుసుము చెల్లించి.. మీరు మీ పూర్తి క్రెడిట్​ రిపోర్ట్​ను కూడా పొందవచ్చు. లోన్​ సర్వీస్​ ప్రొవైడర్ల నుంచి కూడా మీ క్రెడిట్​ రిపోర్టును ఉచితంగా తీసుకోవచ్చు.

మీరు ఎంత తరచుగా మీ క్రెడిట్​ స్కోర్​ను చూసుకోవచ్చు?
రుణదాతలు ప్రతి నెలా క్రెడిట్​ డేటాను బ్యూరోలకు అందిస్తారు. అంటే మీ క్రెడిట్​ రిపోర్ట్​ సర్దుబాట్లు నెలవారీగా జరుగుతూ ఉంటాయి. మీకు బ్యాంకు రుణం, క్రెడిట్ కార్డు బిల్లుల వాయిదాలు ఉన్నప్పుడు ప్రతి నెలా క్రెడిట్​ స్కోర్ చూసుకోవడం మంచిదే. లేదంటే సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు చెక్​ చేసుకుంటే సరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details