తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​ను అమ్మేశాం.. మన భవిష్యత్ ఏంటో తెలియదు: ఉద్యోగులతో సీఈఓ

Parag Agrawal News: ట్విట్టర్​ భవిష్యత్తు ఏంటో అర్థకావడం లేదని ఆ సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఉద్యోగులతో చెప్పారు. సంస్థ కొనుగోలు ఒప్పందం ముగిసే వరకు తానే సీఈఓగా ఉంటానన్నారు. అప్పటివరకు ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

twitter ceo parag
ట్విట్టర్​ను అమ్మేశాం.. మన భవిష్యత్ ఏంటో తెలియదు: ఉద్యోగులతో సీఈఓ

By

Published : Apr 26, 2022, 1:16 PM IST

Twitter CEO: ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లాక ట్విట్టర్​ భవిష్యత్​పై ఆ సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సంస్థలో ఎవరినీ తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మస్క్ యజమాని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, ప్రస్తుతం సంస్థ వద్ద అన్నింటికీ సమాధానాలు లేవని తెలిపారు. కొనుగోలు ఒప్పందం ముగిసే వరకు తానే సీఈఓ పదవిలో కొనసాగుతానని ఉద్యోగులకు పరాగ్ హామీ ఇచ్చారు. ట్విట్టర్​తో మస్క్ డీల్​ పూర్తయ్యే సరికి కనీసం 3నెలల నుంచి 6 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు.

ఒకవేళ పరాగ్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించాలంటే ఆయనకు 42 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పరిశోధనా సంస్థ ఈక్విలార్ తెలిపింది. ప్రక్రియ ముగిసిన తర్వాత ట్విట్టర్​ ప్రైవేటు కంపెనీగా మారి బోర్డు రద్దవుతుందని బోర్డులోని సభ్యుడు ఒకరు తెలిపారు.

Twitter Elon Musk Deal: ట్విట్టర్​ సీఈఓగా 2021 నవంబర్​లో బాధ్యతలు చేపట్టారు 37ఏళ్ల పరాగ్ అగర్వాల్​. ఇప్పుడు 6 నెలలు కూడా పూర్తి కాకుండానే సంస్థ మస్క్​ చేతుల్లోకి వెళ్తోంది. దీంతో పరాగ్ భవిష్యత్​పై కూడా అనిశ్చితి నెలకొంది. ఆయనను సీఈఓగా కొనసాగించేందుకు మస్క్​ ఆసక్తి చూపుతారో లేదో మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. ట్విట్టర్​ను మస్క్​ 44 బిలియన్​ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి:'ట్విట్టర్​'ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్

ABOUT THE AUTHOR

...view details