తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​- డీఏ పెంపు - 7th pay commission

central-government-employees-da-hiked
central-government-employees-da-hiked

By

Published : Mar 30, 2022, 2:43 PM IST

Updated : Mar 30, 2022, 3:06 PM IST

14:39 March 30

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​- డీఏ పెంపు

central government employees da hiked: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త చెప్పింది మోదీ సర్కార్. కరవు భత్యాన్ని(డీఏను) 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో డీఏ 34 శాతానికి చేరినట్లయింది. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన డీఏ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ డీఏ పెంచినట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

DA hike for pensioners: ఈ నిర్ణయంతో.. 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనుంది. గతంలో కరవు భత్యం 31 శాతంగా ఉండగా ఇప్పుడు 3 శాతం పెంపుతో 34 శాతానికి చేరింది. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా 2020లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని కేంద్రం నిలిపివేసింది. 2021 జులై నుంచి పునరుద్ధరించడమే కాకుండా అప్పుడు 17 శాతం ఉన్న డీఏను 28 శాతానికి పెంచింది. అనంతరం.. మరో 3 శాతం పెరిగింది.

ఇవీ చూడండి:బుర్ఖాలో వచ్చి జవాన్లపై బాంబు దాడి.. వీడియో వైరల్

'బంగాళాఖాతాన్ని వారధిగా మార్చుదాం.. మన లక్ష్యాన్ని సాధిద్దాం'

Last Updated : Mar 30, 2022, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details