తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎన్​ఎస్​ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్​షీట్

Chitra Ramkrishna: కో-లొకేషన్​ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ ఎన్ఎ​స్​ఈ సీఈఓ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్​షీట్​ను నమోదు చేసింది. ఛార్జ్​షీట్​ను కోర్టుకు సమర్చించామని.. దర్యాప్తులో కొత్త విషయాలు, ఆధారాలు తెలిస్తే.. ప్రస్తుతం ఉన్న దానికి అనుబంధంగా మరో ఛార్జ్​షీట్​ జోడిస్తామని పేర్కొంది.

Chitra Ramkrishna
చిత్రా రామకృష్ణ

By

Published : Apr 22, 2022, 6:43 AM IST

Chitra Ramkrishna Anand Subramanian: జాతీయ స్టాక్ ఎక్స్చేంజి కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణపై సీబీఐ ఛార్జ్​ షీట్​ నమోదు చేసింది. కో లొకేషన్​ స్కామ్​గా పేర్కొనే ఈ కేసులో మరో నిందితుడు, మాజీ గ్రూప్ ఆపరేటింగ్​ ఆఫీసర్​ ఆనంద్​ సుబ్రమణియన్​ పేరును ఛార్జ్​షీట్​లో జత చేసింది. ఈ విషయాన్ని సీబీఐ సీబీఐ అధికారి వెల్లడించారు. ఛార్జ్​షీట్​ను దిల్లీలోని రౌస్​ అవెన్యూ జిల్లా కోర్టులోని ప్రత్యేక సీబీఐ కోర్టులో సమర్పించినట్లు తెలిపారు. 'ఛార్జ్​షీట్​ను సమర్పించాం. ఒకవేళ దర్యాప్తులో కొత్త విషయాలు, ఆధారాలు వెల్లడైతే ఇందుకు అనుబంధంగా మరో ఛార్జ్​షీట్​ను దాఖలు చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ తన ఛార్జ్​షీట్​లో పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకం, వెంటనే పదోన్నతులు వంటి విషయాల్లో కూడా చిత్ర అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంది. జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్న చిత్రా రామకృష్ణ బెయిల్ పిటీషన్​పై​ విచారణ గురువారం జరగాల్సి ఉండగా.. అది ఈనెల​ 28కి వాయిదా పడింది. మరో నిందితుడు ఆనంద్​ సుబ్రమణియన్​ బెయిల్​ పిటీషన్​పై ఆదివారం విచారణ జరగనుంది.

ఇదీ చూడండి :వారం రోజుల్లో ఐపీఓకు 'రెయిన్​బో' హాస్పిటల్​.. 'ఎల్​ఐసీ' ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details