Bharat Biotech covaxin: కరోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్' ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గడం సహా కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనతో దాదాపు అందరూ టీకాను తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం డిమాండ్ తగ్గిపోయిందని తెలిపింది. దీనిని ముందుగానే గ్రహించామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో నూతన సాంకేతికత అభివృద్ది చేయడం తదితర కార్యకలాపాలపై దృష్టిసారిస్తున్నట్లు పేర్కొంది.
Covaxin Vaccine: కొవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గిస్తున్నాం: భారత్ బయోటెక్ - ప్రపంచ ఆరోగ్య సంస్థ
Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ విజృంభణ తగ్గిందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనతో దాదాపుగా అందరూ టీకా తీసుకున్నారని కాబట్టి ప్రస్తుతం డిమాండ్ తగ్గిందని ఆ సంస్థ తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ఎమర్జెన్సీ యూసేజ్ లిస్ట్‌లో కొవాగ్జిన్ టీకా ఉందని గుర్తుచేసిన భారత్ బయోటెక్.. ఇటీవల డబ్ల్యూహెచ్‌వో.. తమ సంస్థలో చేసిన తనిఖీల్లో సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. డబ్ల్యూహెచ్ఓ చేసిన పలు సూచనలు పాటిస్తున్నామన్నారు. ఎంతో పకడ్బందీగా పరీక్షలు చేసి కొవాగ్జిన్‌ను తయారుచేశామన్న సంస్థ.. మార్కెటింగ్ నిఘా కార్యకలాపాలలో అద్భుతమైన భద్రతను, సమర్థతను కనబరిచిందని తెలిపింది. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:పెరిగిన సిలిండర్ ధరలు.. రికార్డు స్థాయికి ఏటీఎఫ్.. పెట్రోల్ రేట్లు?